40.2 C
Hyderabad
April 28, 2024 16: 33 PM
Slider ఖమ్మం

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

#Collector V.P

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయల భవనసముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి “గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలిస్తూ, దరఖాస్తులను ఫార్వార్డ్ చేశారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంకు చెందిన గుమ్మా వెంకటరామనర్సయ్య తాను వికలాంగుడనని తన తండ్రి అయినటువంటి గుమ్మా కృష్ణయ్య, యస్.యస్.పి కల్లూరు డివిజన్ నందు లస్కర్ గా

విధులు నిర్వహించి పదవి వరమణ పొందారని పింఛను ||పొందుతూ తేది. 12-1-2019 లో మరణించారని తన తల్లి గారు కూడా 2010లోనే మరణించారని తన తండ్రిగారి ఫించను పుస్తకములో తన పేరు నమోదు చేయడం జరిగినదని ప్రభుత్వ మార్గదర్శణాలకనుగుణంగా తన తండ్రిగారి పిన్షన్ వికలాంగుడనైన తనకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తగు చర్యకై ఎన్.ఎస్.యల్.బిసి అధికారికి సూచించారు.

ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట గ్రామంకు చెందిన కాళ్ళ సూర్యనారాయణ తనకు వెలుగుమట్ల రెవెన్యూ సర్వేనెం. 4/అ/1లో 5.27 గుంటల వ్యవసాయ భూమి కలదని అట్టి భూమికి పట్టాదారు పాసుపుస్తకము మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి తగు చర్యకై ఖమ్మం అర్బన్ తహశీల్దారును ఆదేశించారు. పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామ సర్పంచ్ మందడపు అశోక్ కుమార్ అడవి మల్లెల గ్రామం సర్వేనెం. 1లో సన్న, చిన్నకారు రైతులకు సాగులో ఉండి నేటికి పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని వారికి ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు

అందడంలేదని అట్టి భూ సమస్యలను పరిష్కరించి పాసు పుస్తకాలు మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి సమస్యకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా పెనుబల్లి మండల తహశీల్దారును ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామంకు చెందిన రైతులు సర్వేనెం. 402లో 50 మందికి ఎకరం, అర ఎకరం చొప్పున భూమిని ప్రభుత్వం వారు అందించడం జరిగినదని గత 35 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటు

జీవనం సాగిస్తున్నామని వాటికి పానుపుస్తకములు మంజూరు. చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యకై ధరని అధికారి, ఎర్రుపాలెం తహశీల్దారును. కలెక్టర్ ఆదేశించారు, మధిర మండలం సిరిపురం గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు తమ గ్రామం సిరపురంలో య.14-21 కుంటల భూమిలో స్మశాన వాటిక ఉందని అట్టి స్మశాన వాటికను సర్వే చేయించి హద్దులు. నిర్ణయించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యకై మధిర తహశీల్దారును

ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంకు చెందిన కందుల వీరబాబు తన తండ్రి పెద్ద వెంకన్న 2019వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మరణించినారని, ఆపధ్భాందు పథంకు కొరకు దరఖాస్తు చేయడం జరిగినదని ఆపద్మాందు పథకంను అందించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యకై జిల్లా రెవెన్యూ అధికారికి కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు. స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు “గ్రీవెన్స్ డే” లో పాల్గొన్నారు.

Related posts

షేమ్ షేమ్ : అత్యాచారాల భారత దేశం

Satyam NEWS

మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ఇంట్లో ఐ‌టి దాడులు

Murali Krishna

పోలీస్ కిష్టన్న వర్దంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Bhavani

Leave a Comment