40.2 C
Hyderabad
April 29, 2024 18: 46 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం…..

కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.

సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటల వరకు వేడుకగా జరగనుంది. తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రామరాజు, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Related posts

మానవత్వం చూపిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

Satyam NEWS

మాల ఉద్యోగుల చైతన్య సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడవద్దు

Satyam NEWS

Leave a Comment