Slider ముఖ్యంశాలు

చంద్రబాబును, అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయాలి

#narasaraopetpolice

వైసీపీ నేతలను తిట్టిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు పై నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ రావు కు గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ,మంత్రులను అసభ్య పదజాలం తో దూషించిన అయ్యన్న పాత్రుడు ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సభ్య సమాజం  సిగ్గు పడే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అయ్యన్నపాత్రుడు గంజాయి మాఫియా నడిపేవాడని ఆయన అన్నారు. అటువంటి చరిత్ర ఉన్న అయ్యన్న దళిత  హోమ్ మినిష్టర్ ను కూడా ఆమె కులం పేరుతో దూషించాడని అన్నారు.

వెంటనే చంద్రబాబు నాయుడు, అయ్యన్నపాత్రుడులను అరెస్టు చెయ్యాలని జంగా డిమాండ్ చేశారు. శాసన సభ్యులు గోపిరెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం లో మత్తు  మాఫియా కు అయ్యన్నపాత్రుడు పెద్ద తలకాయ అని అన్నారు. అలాంటి వ్యక్తి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసాడని గోపిరెడ్డి అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖను సైతం దూషించటం చాలా దారుణం అని అన్నారు. అయ్యన్న పాత్రుడి మత్తు కి అలవాటు పడ్డారు.. లోకేష్  స్వార్ధ పూరిత రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నారు అని అన్నారు.

Related posts

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

స్పంద‌న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

Satyam NEWS

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

Satyam NEWS

Leave a Comment