39.2 C
Hyderabad
April 28, 2024 11: 42 AM
Slider మహబూబ్ నగర్

కరోనా ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

#KollapurHospital

కరోనా ను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  విఫలమయ్యాయని సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివవర్మ అన్నారు.

జనసేన కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సాంబ శివుడు, సిపిఐ కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి యం డి.యూసూప్ తో కలిసి ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఒకపక్క రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి, ఈ చల్లని వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని వామపక్ష పార్టీలు గా రాష్ట్ర ప్రభుత్వానికి  గుర్తు చేసినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం లేదని వారు విమర్శించారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా కు సంబంధించి టెస్టులు చేసేందుకు సరిపడా డాక్టర్లు గాని, సిబ్బంది గాని, లేకపోవడం విడ్డూరమన్నారు.

కొల్లాపూర్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లో 37 మంది ఉండాల్సిన స్టాఫ్ కు 18 మంది మాత్రమే ఉన్నారని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రతి ఆస్పత్రిలో సిబ్బందిని పెంచామని, కరోనా కు సంబంధించిన అన్ని కిట్లు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారు తప్ప ఎక్కడ కూడా అది అమలు జరగడం లేదని వారు విమర్శించారు.

కనీసం ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే వాళ్లకు స్కానింగ్ తీయించుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు లేవని, ప్రభుత్వ ఆసుపత్రిలో 7 మంది డాక్టర్స్ ఉండాల్సింది, ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు, తగిన పరికరాలు అందించి కరోనా బాధితులకు, తగిన సదుపాయాలు కల్పించకపోతే ఈ ప్రభుత్వం పైన రాబోయే రోజుల్లో తిరుగుబాటు తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి భాస్కర్, ఎం డి సలీం, మధుసూదన్, రాజు జనసేన నాయకులు కేతేపల్లి శివ, తలారి కిరణ్, వంశీ, మాదాసు విజయ్, సిపిఐ నాయకులు, ప్రమోద్, కలీం, పాల్గొన్నారు.

Related posts

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

Satyam NEWS

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

Satyam NEWS

మహారాష్ట్రలో సౌతాఫ్రికా ప్రయాణికుడికి కరోనా

Sub Editor

Leave a Comment