29.7 C
Hyderabad
May 2, 2024 03: 47 AM
Slider ప్రత్యేకం

రైతులకు ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ

#MalluBhattivikramarka

రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే నెల 6న వరంగల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయి అన్నదాతలు ఆనందంగా లేరని అన్నారు.  అందుకనే రైతులకు మానసికంగా ధైర్యం కల్పించి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారితంగా ఆర్థికంగా రైతులు ఎదగడం కోసం ఎలాంటి పథకాలు అమలు చేశాయో వాటిని వివరిస్తూ భవిష్యత్తులో అలాంటి పథకాలతో రైతులను ఆదుకుంటామని భరోసా ఇవ్వడం తో పాటు

వ్యవసాయానికి కాంగ్రెస్ ఏం చేస్తుంది అనే విషయాలను  వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ వివరిస్తారని వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించామన్నారు. కాగా గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిందని కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల లక్ష రూపాయల రుణానికి  వడ్డీ మీద వడ్డీ పెరిగి నాలుగు లక్షలు అయిందని, ఈ రుణము తీర్చడం ఇప్పుడు రైతులకు తీవ్రమైన భారంగా మారిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో రైతులకు లక్ష లోపు వడ్డీలేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్లింకర్లు, పందిరి సాగు 100% సబ్సిడీ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుబంధు తీసుకొచ్చి కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన వాటన్నిటిని బందు చేసి వ్యవసాయాన్ని పండగ చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించింది అన్నారు. పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని దళిత గిరిజన బలహీనవర్గాల రైతులకు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించడానికి అసైన్డ్ భూములను పంపిణీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కొని ప్లాట్లు చేయడం దుర్మార్గమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం కోసం పని చేసిన కాంగ్రెస్ భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి, రైతులకు మరీ ముఖ్యంగా కౌలు రైతులకు, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్లాట్లు చేయడానికి బలవంతంగా గుంజుకుంటున్న అసైన్డ్ భూముల రైతులకు ఏం చేయనున్నామో..వరంగల్ సభలో తమ అధినేత రాహుల్ గాంధీ వివరిస్తారని వెల్లడించారు. రాహుల్ గాంధీ పాల్గొనే ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జిగ్నేష్ మేవాని అరెస్టుకు సీఎల్పీ ఖండన

ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ దళిత శాసనసభ్యులు జిగ్నేష్ మేవాని ట్విట్టర్ లో పోస్ట్ చేసినందుకు అరెస్టు చేయడాన్ని  తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను బిజెపి హరిస్తుందని మండిపడ్డారు. దళితులు కేంద్రంలోని బిజెపికి  బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

Related posts

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ హుండీ లెక్కింపు

Satyam NEWS

కరోనా కాలాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలి

Satyam NEWS

డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్

Murali Krishna

Leave a Comment