28.7 C
Hyderabad
April 28, 2024 04: 55 AM
Slider ప్రత్యేకం

డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్

special action plan for drug control

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తునట్లు ఐజీపీ రాజేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా  జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఏస్పీలతో ఐజీపీ రాజేష్ కుమార్  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని సమీక్ష జరిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలతో సహా  గతంలో అరెస్టయిన వ్యక్తుల పాత్ర, ఇతర ముఠాలతో వారి సంబంధాలు, గతంలో వారి  నేరాలు, వారి కార్యనిర్వహణ పద్ధతిని ట్రాక్ చేయడంలో అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల నేరస్థుల కట్టడి  సులభతరం చేసేందుకు పోలీస్‌ శాఖకు అందుబాటులో వున్న  టెక్నాలజీ జోడించి మరింత దూకుడు పెంచాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్‌.డి.పి.ఎస్‌ యాక్ట్‌ కేసుల పర్యవేక్షణకు వేదికగా చేసుకొని మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్‌ స్పాట్‌ల గుర్తింపు, ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నేరస్థుల సమాచారాన్ని   ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కమిషనర్ లు, ఎస్‌పి లు తమ తమ జిల్లాల పరిధిలో  గంజాయి నియంత్రించేందుకు జిల్లాలో  చేపట్టిన ప్రణాళికను వివరించారు.

Related posts

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS

మహిళ దారుణ హత్య

Bhavani

Leave a Comment