33.7 C
Hyderabad
April 29, 2024 02: 45 AM
Slider కడప

కరోనా ఎఫెక్ట్: రాజంపేట డిఎస్పీ ఆగ్రహం… అనుగ్రహం

Rajampet DSP

సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పినా వినని ప్రజలపై కడప జిల్లా రాజంపేట డిఎస్పీ నేడు తీవ్రంగా మందలించారు. ఇక్కడి కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మార్కెట్ లో కూరగాయలు కొనేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా రావడంతో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

గురువారం ఉదయం ఆయన మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్, టౌన్ ఎస్.ఐ. ప్రతాప్ రెడ్డి తదితరు లతో కలిసి మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గుంపులు గుంపులు గా కొనుగోలు చేస్తున్న వారిపై, వ్యాపారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్దేశించిన గడిలో నిలబడి కొనుగోలు చేయాలని సోషల్ డిస్టన్స్ పాటించాలని వారిని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత వారికి కరోనా వ్యాధి లక్షణాలను వివరించి సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకు పాటించాలో వివరించారు.

కాగా శివా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గ్లవుజులు, మాస్క్,సోప్ లను ప్రజలకు పంపిణీ చేశారు. వారు బైక్ పై వచ్చే వారిని జాగ్రత్తగా ఉండాలని కరోనా భూతం రూపంతో ప్రదర్శన నిర్వహించారు.

Related posts

బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్రతుపాను

Satyam NEWS

రంగుల తయారీ కంపెనీలో ప్రమాదం

Bhavani

ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేని బ‌డ్జెట్ ఇది

Satyam NEWS

Leave a Comment