30.3 C
Hyderabad
March 15, 2025 09: 10 AM
Slider కరీంనగర్

డోంట్ బ్లెమ్:కేంద్రనిధులపై శ్వేతపత్రానికి కేటీఆర్ రెడీ నా

rajasingh at vemulawada

కేంద్రం నుండి నిధులు రావడం లేదని కేటీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమని ,దమ్ముంటే మీ ప్రభుత్వం నుండి కేంద్ర నిధులు తీసుకోవడం లేదని శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.వేములవాడ లోని తాటికొండ ఫంక్షన్ హాళ్లలో అయన బిజెపి కార్య కర్తల సమావేశంలో మాలాడారు.కేంద్రం నిధుల విషయంలో అమెరికా నుండి పారాచూట్ వేసుకుని వచ్చిన కేటీఆర్ కు ఎం తెలుసునని అయన ఎద్దేవా చేశారు.

వేములవాడ అభివృద్ధి చేస్తానని ప్రకటించిన కేటీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన రూ.400 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని కోరారు.అసలు అభివృద్ధి కాగితాలపైనే ఉందని ఆచరణలో లేదని 8 లక్షల డబల్ బెడ్ రూమ్ లు ఇస్తానన్నారు ఎంతమందికి ఇచ్చారో తెలుపాలని,మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి రావడం లేదని,ఇంటికో ఉద్యోగం దళితులకు భూమి కానరాకుండా పోయాయని అయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించారు.బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణా చేసిన ఘనత మీకే దక్కుతుందని అయన ఎద్దేవా చేశారు.

టీఆరెస్తె ఓడిపోతే పెన్షన్లు రావని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు.తే లంగాణా లో బీజేపీ లేదని ప్రచారం చేసిన టీఆరెస్ నాయకుల కారు పంక్చర్ చేసి నాలుగు ఎంపీ సీట్ లు గెలిచామని తెలిపారు.వేములవాడ ఎమ్మెల్యే జర్మనీ నా ? ఇండియానా ముందు చెప్పాలని అయన రమేష్బాబు ను కోరారు.యువత చైతన్య వంతమై రానున్న రెండు రోజులు కస్టపడి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో నాయకులు ప్రతాప రామకృష్ణ,తీగల రవీందర్ గౌడ్,రేగుల మల్లికార్జున్,రాజిరెడ్డి , మహేష్ గోపు బాలరాజు తదితరులు ఉన్నారు.

Related posts

పాఠశాలల పున:ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇవే

Satyam NEWS

మళ్లీ కుక్క బుద్ధి ప్రదర్శించిన చైనా

Satyam NEWS

సెప్టెంబ‌రు 19 నుండి 27 వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment