40.2 C
Hyderabad
May 1, 2024 17: 47 PM
Slider విజయనగరం

రామతీర్థం కొండపై రాముని విగ్రహం ధ్వంసం..!

#SPVijayanagaram

ఏపీలో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ చరిత్ర కలిగిన రామతీర్ధం దేవస్థానం కొండపై అపచారం జరిగింది.కొండపై ఎన్నో ఏళ్ల కిందట ప్రతిష్టింపబడిన విగ్రహం ద్వంసం జరిగింది. కొండపై కొలువున్న రాముని విగ్రహం ద్వంసానికి గురైంది. ఉదయాన్నే అర్చనకు వెళ్లిన ఆలయపూజారికి రాముని విగ్రహం ద్వంసం కనిపించడంతో వెంటనే దిగువన ఉన్న ఆలయాధికారులకు చెప్పారు.

వెంటనే ఆలయ అర్చకులు అప్రమత్తమై…నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… కొండపై జరిగిన విధ్వంసం పై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఓ వైపు సీఎం పర్యటన జిల్లా ఉండబోతున్న  తరుణంలో ప్రఖ్యాతి గాంచిన రామతీర్థం కొండపై ఘటన జరగడంతో.. జిల్లా పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

 సమాచారం తెలుసుకున్న ఎస్పీ రాజకుమారీ వెనువెంటనే రామతీర్థం వెళ్లారు. ధ్వంసం అయిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.క్లూస్ టీమ్స్ ను రంగంలో కి దించారు. ఆగంతకులకై స్పెషల్ టీమ్ లను దించారు.సమాచారం తెలుసుకున్న సత్యం న్యూస్  ప్రతినిధి..సంబంధిత ఆలయ అర్చకులను సంప్రదించారు.

తెల్లవారుజామున ఈ ధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. అదీగాక కొండపై ఒక్కపూటే ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారు. సాయంత్రం పూట కొండపైకి ఎవ్వరూ ఆలయానికి సంబంధించి పూజలేవీ జరగవని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కాగా విగ్రహం ధ్వంసం సెన్సిటివ్ పరమైన అంశం కావడంతో ఎవ్వరూ బహిరంగంగా అసలేం జరిగింది… చెప్పలేకపోతున్నారు. ఏదైనా నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

7డేస్ ఆఫర్స్:రాజన్న హుండీ ఆదాయం 99 .10 లక్షలు

Satyam NEWS

వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు

Satyam NEWS

ఖమ్మం బీఆర్ఎస్ సభ ఫెయిల్: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment