26.7 C
Hyderabad
April 27, 2024 07: 54 AM
Slider ముఖ్యంశాలు

Ohh God: కుక్కలు, పందులపై ఇక అపరాధ రుసుం

#Dogs and Pigs

కుక్కలు పందులు పెంచుతున్నారా? అయితే మీకు పిడుగులాంటి వార్త ఇది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఒక విచిత్రమైన జీవో విడుదల చేసింది.

ఇక నుంచి కుక్కలు, పందులకు లైసెన్స్ లు ఉండాలంటూ జీవోలో పేర్కొన్నారు. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 జరిమానా తో పాటు రోజుకు రూ.250 అపరాధ రుసుము వసూలు చేయాలని జీవోలో పేర్కొంది.

ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని ఆదేశాల్లో పేర్కొంది. అదే విధంగా హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలి.

లైసెన్స్‌లు పొందే ముందు కుక్కలు, పందుల యజమానులు వాటి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం అందజేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటికి హెల్త్ సర్టిఫికెట్  ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదేశించింది.

ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ టోకెన్లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని ఆదేశించింది.

ఈ మేరకు జీవో ఎంఎస్ 693లో పంచాతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు.

Related posts

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ట్యాబుల పంపిణీ

Bhavani

1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo

Bhavani

ప్రొఫెసర్‌ జి.హర గోపాల్‌పై కేసులు పెట్టటం దుర్మార్గం

Bhavani

Leave a Comment