32.2 C
Hyderabad
May 8, 2024 11: 48 AM
Slider మహబూబ్ నగర్

అధికారుల కనుసన్నల్లో రేషన్ దందా…?

#Ration Rice

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లోని దుర్గంబిక రైస్ మిల్ నుండి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో గుజరాత్ కు చెందిన లారీ లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నరనే పక్క సమాచారంతో వెల్దండ శివారులో వెల్దండ ఎస్సై నర్సింహులు పట్టుకుని లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారులకు సమాచారమివ్వగా శనివారం మధ్యాహ్న సమయంలో వెల్దండ మండలానికి చేరుకున్న అధికారులు లారీలో ఉన్న బియ్యాన్ని నామమాత్రపు తనిఖీలు నిర్వహించి, సరైన ధ్రువ పత్రాలు లేకున్నా రేషన్ బియ్యం కాదని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు.

పిండి లేనిదే రొట్టె తయారు చేసిన విధంగా అధికారుల ధోరణి ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. సదరు రైస్ మిల్ యజమానులు వడ్లు కొనుగోలు చేసినట్టుగా, రైస్ మిల్లు లో వడ్లను బియ్యంగా మార్చినట్టు వేరే బియ్యం ఖరీదు చేసినట్టుగా, వేరే వారికి అమ్మినట్టు డూప్లికేట్ బిల్లులను తయారు చేసి తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులకు చూపించారు.

కానీ రైసు మిల్ నడిచినట్టు కరెంటు బిల్లులు తనిఖీ చేయకుండా, మార్కెట్ ప్లీజ్ కట్టినట్టు తనిఖీ చేయకుండా ఇవి రేషన్ బియ్యం కాదు అని నిర్ధారణ చేసే అధికారులకు ఉంటే ఇక  కోర్టులు,ల్యాబ్ లు ఎందుకని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 గతంలో సత్యం న్యూస్ పలు మార్లు కథనాలలో జిల్లా అధికారులకు, రైస్ మిల్ యజమానులు సత్సంబంధాలు ఏర్పడి వారితో కుమ్మక్కు అయి రైస్ శాంపిల్ తనిఖీలలో తూతూ మంత్రంగా కొనసాగించారని సాక్ష్యాలతో సహా నిరూపణ ఉన్న అవి నిరుపయోగంగా మారాయి అనడానికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా క్షేత్ర స్తాయి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related posts

కరోనా కట్టడి చేయలేక మమ్ములను అరెస్టు చేస్తారా?

Satyam NEWS

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment