36.2 C
Hyderabad
April 27, 2024 19: 31 PM
Slider కడప

నందలూరు లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల కు వినతి

#NandaluruRlyStation

నందలూరు రైల్వే స్టేషన్లో గతంలో మాదిరి రాయల సీమ ఎక్స్ ప్రెస్ ను ఆపాలని మాజీ ఎమ్మెల్సీ ,రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కన్వీనర్, రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు నందలూరు రైల్వే స్టేషన్ సూపర్నిడెంట్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు మండలంలో రాయలసీమా ఎక్స్ ప్రెస్ (02793, 02794) ప్రారంభం నుంచి స్థాపింగ్ ఉందన్నారు. ఇటీవల ప్రపంచాన్ని ఓణికించిన కరోనా మహామ్మారి నేపధ్యంలో మనదేశంలో కూడా రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తగా రైళ్లు నిలుపుదల చేశారన్నారు.

ఇటీవల పాక్షికంగా రైళ్లు పునఃప్రారంభం చేయడం అభినందనీయమని, అయితే నందలూరులో స్టాపింగ్ తొలిసారిగా ఇవ్వకపోవడం విచారకరమన్నారు. ఒక్క రోజు మాత్రం రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేసి,మరుసటి రోజు నుంచి అపక పోవడం తమకి బాధ కలిగించిందని,గతంలో ఏ స్టేషన్లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ అగుతుందో ఆయా స్టేషన్లో అగుతుందని మీడియాలో ప్రకటించి ఉన్నారని వెంటనే స్టాపింగ్ ఇవ్వాలని కోరారు.

అనేక వ్యాపారాలు, ఉద్యోగులు,రైతులు,గల్ఫ్ దేశాలకు వెళ్లే ఉన్న ఈ ప్రాంతంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు ద్వారా వెళ్లేవారని,ఈ ప్రాంత జనాభా దాదాపు 50 వేలమంది పైగా ఉన్నారని అన్నారు.

ఇందులో దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్లో నందలూరు లోకో షేడ్ మొట్ట మొదటిది కాగా,దీన్ని బ్రిటిష్ హయంలో ఏర్పాటు చేశారని, ఇంకా మండలం లో కోర్టు, రైల్వే ఆసుపత్రి,ఆల్విన్ కర్మాగారం తో,ప్రభుత్వ ఆసుపత్రి సహా అనేక విభాగాలు ఉండేవని,అనేక రైళ్లు నిలుపుదల చేసేవారన్నారు.

నందలూరు మండలంతో పాటూ సుదూర ప్రాంతాలవారు క్యాన్సర్ తో పాటూ, అనారోగ్యం తో బాధపడే వారు హైదరాబాద్ తో పాటూ వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రాయల సీమ ఎక్స్ ప్రెస్ మంచి సౌకర్యం ఉండేదన్నారు.

ఇప్పుడు నిలుపుదల చేయక పోవడం వలన వారు ఇబ్బందులు పడుతున్నారని, దయచేసి మా నందలూరు రైల్వే స్టేషన్లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేయాలని ,స్థాపింగ్ ఇవ్వకుంటే గాంధీ యుతంగా నిరసన వ్యక్తం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎద్దల సుబ్బారాయుడు, రామసుబ్బన్న, సమ్మెట శివ,శివరామరాజు, భారతల శ్రీధర్ బాబుయాదవ్,ప్రవీణ్,వెంకటయ్య,శివా,బీమా మునుస్వామి,మోడ పోతుల రాము,చామంచి పెంచాలయ్య,హరి,చుక్కా యానది,పొత్తపి రమణయ్య,త్యాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పారిశుధ్య కార్మికునిపై సానిటర్ ఇన్ స్పెక్టర్ దాడి

Satyam NEWS

పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

కార్మిక చట్టాలను పోరాటాల ద్వారా కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment