35.2 C
Hyderabad
April 27, 2024 13: 21 PM
Slider నల్గొండ

కార్మిక చట్టాలను పోరాటాల ద్వారా కాపాడుకోవాలి

#SheetalRoshapathi

శ్రమ జీవుల హక్కులను హరించే చట్టాలని తెస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నవంబర్ 26 న,జరిప తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పార్టీలకి అతీతంగా అందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఎరువుల షాపుల అసోసియేషన్ వారికి, హోల్సేల్ ఉల్లిగడ్డలు, ఐరన్ షాపులు, తదితర షాపులకు  సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం కార్మికులతో రోషపతి మాట్లాడుతూ కార్మిక చట్టాలను ఎప్పుడు పాలకవర్గాలు బంగారు పళ్లెంలో పెట్టి అందివ్వలేదని, ఇప్పుడు ఉన్న చట్టాలను కార్మికులమైన మనమే పోరాడి సాధించుకున్నవే నని, అందుకే పోరాటమే మార్గం అని అన్నారు.  

బ్రిటిష్ కాలం నుంచి ఇలాంటి దాడులు, పోరాటాల ద్వారా ఎదుర్కొన్నామని, అందుకే కార్మిక శక్తితో తిప్పి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో శీను, లక్ష్మీనారాయణ, రామన్న, సైదులు, కోటేశ్వరరావు, వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్

Satyam NEWS

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బిచ్కుంద ఎంపీపి

Satyam NEWS

తాండూరు లో విత్తన గణపతుల పంపిణీ

Bhavani

Leave a Comment