30.7 C
Hyderabad
April 29, 2024 03: 22 AM
Slider నిజామాబాద్

రికార్డు స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు

#pocharam

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంపై అధికారులు, కాంట్రాక్టర్ల తో బాన్సువాడ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో (2022-23) రూ. 10,000 కోట్లను కేటాయించిందని, అందులో భాగంగా హడ్కో సంస్థ నుండి రూ. 1000 కోట్లను రుణంగా తీసుకోవడానికి గృహ నిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నిన్న సంతకం చేశారని స్పీకర్ వెల్లడించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం GO MS NO. 2 ను అక్టోబర్10,2022న జారీ చేసింది. బాన్సువాడ నియోజకవర్గానికి మొత్తం పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయని స్పీకర్ తెలిపారు. ఇందులో అయిదువేల ఇళ్ళ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు జరగగా మిగతా ఇళ్ళు నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్నాయి. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 120 కోట్ల బిల్లులు రావాలి. మొత్తం బిల్లుల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి వినతి చేయడంతో  అంగీకరించారని స్పీకర్ తెలిపారు.

పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఇళ్ళకు సంబంధించి రీడింగ్ లను అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితంగా తీసుకుని వెంటనే ఫైనల్ చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే కాంట్రాక్టర్లు, లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు అందుతాయని ఆయన తెలిపారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కష్టాల్లో ఉన్నవారిని పలుకరిస్తూ…. ఆనందంలో ఉన్నవారిని అభినందిస్తూ…

Satyam NEWS

కడప జిల్లాలో శ్రమదానంతో జనసేన రోడ్ల మరమ్మతులు

Satyam NEWS

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

Satyam NEWS

Leave a Comment