28.7 C
Hyderabad
April 28, 2024 09: 10 AM
Slider ముఖ్యంశాలు

అధిష్టానం జూపల్లి కి రెడ్ కార్పెట్ వేసిందా?

#Jupally

తెలంగాణ రాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని త్యాగం చేసి  కేసీఆర్ తో కలిసి ఉద్యమ బాటలో నడిచి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు గులాబీ పార్టీ అధిష్టానం  రెడ్ కార్పెట్ వేసిందని ఆయన అనుచర వర్గం ఫుల్ జోష్ లో ఉన్నారు.

2022 లోనే జమిలి ఎన్నికలు వస్తాయని ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో ఈ కొత్త మలుపు వారికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఈ సమయంలోనే  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు సంకేతాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఇక కొల్లాపూర్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

జోష్ లో మాజీమంత్రి జూపల్లి వర్గం?

నిజంగా 2022లో జమిలి ఎన్నికలు జరిగితే అధికార పార్టీ నుండి అన్ని విధాలుగా జూపల్లికి సపోర్ట్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. అయితే అధిష్టానం నిజంగా రెడ్ కార్పెట్ వేసిందా? లేదా అనేది ప్రశ్న?  జూపల్లి కి తిరుగు లేదని, ప్రజలు ఆయన వైపు ఉన్నారని అంటున్నారు. ఇక్కడ ఇప్పటికే అధికార పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు.

మరో వైపు కొల్లాపూర్ నియోజక వర్గ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అభిలాష్ రావు రంగినేని పార్టీ ఆదేశాలకు కట్టుబడి నియోజకవర్గంలో అటు పార్టీ కార్యక్రమాలకు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. అందరి గొంతులో ఆయన కూడా వినిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త పరిణామం ఆసక్తి పెంచుతున్నది.

Related posts

నారాయణగూడా ట్రాఫిక్ సి.ఐ.వెంకన్నకు సన్మానం                                            :

Satyam NEWS

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

Bhavani

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన

Satyam NEWS

Leave a Comment