33.7 C
Hyderabad
April 29, 2024 01: 08 AM
Slider మహబూబ్ నగర్

రక్త సేకరణలో ముందున్న వనపర్తి రెడ్ క్రాస్

#WanaparthyCollector

రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించి రక్త సేకరణ చేయడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ముందున్నదని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ లో సభ్యులను చేర్పించాలని అన్నారు. విరివిగా రక్తదాన శిబిరాలు  ఏర్పాటు చేయాలన్నారు. రెడ్ క్రాస్ భవన నిర్మాణాలకు ప్రభుత్వ స్థలం ఉంటే పరిశీలించాలన్నారు.

జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ హోమ్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. రెడ్ క్రాస్ పరిధిలో నడుస్తున్న జనరిక్ మందుల షాపులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెడ్ క్రాస్ సేవలు విశేషంగా అందించారని ప్రశంసించారు.

కరోనా సమయంలో రెడ్ క్రాస్ ద్వారా మాస్క్ లు, శానిటైజర్ లు సబ్బులు అందించారన్నారు. రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నందున ప్రజలకు రెడ్ క్రాస్ తరఫున తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అధికారి  రేవతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో  డీఎంహెచ్వో శ్రీనివాసులు, చైర్మన్ కాజా కుతుబుద్దీన్, వైస్ చైర్మన్ ఎండీ అమర్, సభ్యులు మురళీధర్, చిన్నమ్మ థామస్, కలాం భాష, జె యం మిషేక్, రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

పోలీస్ స్పంద‌న‌కు త‌గ్గుతున్న ఫిర్యాదు దారులు….!

Satyam NEWS

గురజాల సిమెంటు ఫ్యాక్టరీలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించాలి

Satyam NEWS

వైభవంగా పెళ్లి చేసుకుంటే కటకటాలు గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment