40.2 C
Hyderabad
April 29, 2024 18: 08 PM
Slider కర్నూలు

కర్నూలు జిల్లా లో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

#RedsandersSmugglers

తిరుపతి లోని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కర్నూలు జిల్లాలో ని కొలిమిగుండ్ల మండలం లో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు.

వీటిని మోసు కుని వస్తున్న వారిలో నలుగురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాలు మేరకు డీఎస్పీలు కేసి వెంకటయ్య, వివి గిరిధర్, మురళీధర్ ల ఆధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ ఆఫీసు కు చెందిన ఆర్ ఐ రవికుమార్ కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తోళ్ల మడుగు గ్రామం   సమీపంలోని అడవుల్లోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ల వద్ద తనిఖీలు చేపట్టారు.

సమీపంలో ని చీనీ తోట నుంచి కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో ఆర్ ఐ రవికుమార్ తన సిబ్బంది తో వారిని అడ్డగించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో నలుగురిని పట్టుకోగలిగారు.

వారిని అదే ప్రాంతానికి చెందిన తలారి రమేష్ (25), వి. కేశవులు (36), జి. బాబ్జీ (43),  ఎం. పాల్ (25) గా గుర్తించారు. వీరు ఎర్రచందనం దుంగలు సేకరించి, చీనీ తోటలో దాచి, తమిళ స్మగ్లర్లు కు విక్రయిస్తున్నారని విచారణ లో తెలిసిందని డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. సిఐ వెంకట రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

17మంది పేకాట‌రాయుళ్ల అరెస్ట్‌

Sub Editor

స్వీట్లే కాదు సమాజానికి స్ఫూర్తిని పంచిన పుల్లారెడ్డి

Satyam NEWS

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS

Leave a Comment