38.2 C
Hyderabad
April 29, 2024 12: 34 PM
Slider ముఖ్యంశాలు

జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద రెడ్లదే పెత్తనం..!

#SudhakarReddy20

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద రెడ్ల పెత్తనం కొనసాగుతోందని, ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండు రోజుల క్రితం తిరుపతిలో  జరగిన ప్రివిలేజ్ కమిటీ ముందు తన హక్కులకు భంగం కలుగుతోందని నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా కన్నీరు పెట్టుకోవడం ఇందుకు తార్కాణం అన్నారు. అదే రోజు చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, అధికారులు తమని ఖాతరు చేయడంలేదంటూ కమిటీ ముందు వాపోయారని తెలిపారు.

 చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లకు తప్ప ఎవరికీ అధికారులు విలువ ఇవ్వడం లేదని ఆ ఎమ్మెల్యేలు కమిటీ దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు.

కలెక్టరే కాదు తహసిల్దార్లు, పోలీసులు ఆఖరికి గుమాస్తాలు కూడా తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని చెప్పారు.

ఇది చిత్తూరుకే పరిమితం కాదని రాష్ట్రమంతా అలాగే ఉందన్నారు. జగన్ రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి, వైవి సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డికి తికట్టు పెట్టారని ఆరోపించారు. ఆ పార్టీ ఎం పి రఘు రామకృష్ణ రాజు  పేర్కొన్నట్టు రాష్ట్రాన్ని ఈ ముగ్గురు పాలేగాళ్ళు పాలిస్తున్నారని చమత్కరించారు.

ఏడాది క్రితమే మాజీమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలకు విలులేదని చెప్పారని గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి  అధికారులు తన మాట వినడం లేదని కార్యకర్తల వద్ద వాపోయారన్నారు.

రెండు నెలల క్రితం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద రావు స్థానిక రెడ్ల పెత్తనంపై తిరగబడ్డారని తెలిపారు. రాష్ట్రంలో 100 మందికి పైగా ఎమ్మెల్యేల పరిస్థితి రోజా స్థితిలాగే వుందని చెప్పారు.

జగన్ పాలనా తీరు మార్చుకోకపోతే పార్టీలో తిరుగుబాటు తప్పదని సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.

Related posts

గెట్ రెడీ: లాక్ డౌన్ పొడిగిస్తే అందరం సహకరిద్దాం

Satyam NEWS

దిఎండ్:కలెక్టర్ గుర్రు కమిషనర్ సయోధ్య ఈ.ఓకు మద్దతు

Satyam NEWS

ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలతో ఇన్ని అభివృద్ది పనులు

Bhavani

Leave a Comment