Slider హైదరాబాద్

యాచకులను షెల్టర్లకు తరలించడం బెస్టు

Talasani 241

కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కార్మికుల సమస్యలు తదితర అంశాలపై జీహెచ్ఎంసి పరిధిలోని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మేయర్ తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెల్ల రేషన్ కార్డు లేనివారి జాబితా ను సిద్దం చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. బియ్యం పంపిణీ చేయాల్సిన వలస కూలీల వివరాల సమగ్ర సమాచారం సేకరించాలని ఆయన ఆదేశించారు.

నగర పరిధిలో ఆహారం పంపిణీ ని జీహెచ్ఎంసి ఆధ్వర్యంలోనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇష్టానుసారం గా పంపిణీ చేస్తుండటంతో రోడ్లపై యాచకులు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారని ఆయన అన్నారు. రోడ్ల పై ఉన్న యాచకులను సమీపంలోని షెల్టర్ లకు తరలించాలని ఆయన ఆదేశించారు.

యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ పాఠశాలలను షెల్టర్ గా వినియోగించుకోవాలని సూచించారు. షెల్టర్ లకు తరలించిన వారికి జీహెచ్ ఎంసి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించడం తో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

లాక్ డౌన్ కారణంగా ట్రాపిక్ రద్దీ లేనందున నూతన రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు రోడ్ల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించాలి. 5 సంవత్సరాల పాటు రోడ్ల నిర్వహణ గుత్తేదారు బాధ్యత ఉంటుందని మంత్రి తెలిపారు.

మేయర్ బొంతు రాంమోహన్, మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి,  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

రుతుపవనాలు మరో 4 రోజులు ఆలస్యం

mamatha

ప్రతిష్టాత్మక ప్రగతినగర్ కు ఎమ్మెల్యే వరాల జల్లు

Satyam NEWS

కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల భేటీ

mamatha

Leave a Comment