28.7 C
Hyderabad
April 27, 2024 05: 36 AM
Slider వరంగల్

క్రీడా సామాగ్రి కొనుగోలుకు నిధుల విడుదల

#sports equipment

క్రీడా సామాగ్రి కొనుగోలు, నిర్వహణ, వృత్తి విద్యా నిర్వహణకు, సివిల్ వర్క్స్ కు గాను మొత్తం 1,72,50,374,( ఒక కోటి డెబ్బై రెండు లక్షల యాబై వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మంజూరు అయినట్టు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి G పాణిని తెలిపారు. జిల్లా లోని పాఠశాలలకు, పాఠశాల సముదాయాలకు, మండల విద్యా వనరుల కేంద్రాలకు 2022-23 విద్యా సంవత్సరం కు గాను ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు.

సమగ్ర శిక్ష ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాల నిర్వహణకు అవసరమైన నిధులు 84,45,000 రూపాయలు 417 పాటశాల ల ఖాతా లలో జమ చేయడం జరిగిందని, వీటిని నియమ నిబంధనల ప్రకారం రికార్డ్స్, రిజిస్టర్ ల కొనుగోలుకు, జాతీయ పండుగ ల నిర్వహణకు , టాయిలెట్ సామాగ్రి, విద్యుత్ బిల్లులకు ఖర్చు చేయాలని చెప్పారు. 331 పాఠశాల లకు 2090000 రూపాయలు క్రీడా సామగ్రి కొనుగోలు కు నిధులు వారి ఖాతా లలో జమ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ నిధులను రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రీడా పరికరాల కొనుగోలు కు ఖర్చు చేయాలని చెప్పారు. జిల్లా లోని 30 పాఠశాల సముదాయాలకు 495000 రూపాయలు సంబంధిత ఖాతాలో జమ చేశామని చెప్పారు. సముదాయ సమావేశం నిర్వహణకు, కృత్య మేళ నిర్వహణకు, రికార్డ్స్ రిజిస్టర్ ల కొనుగోలు, సముదాయ ప్రధానోపాధ్యాయుల ప్రయాణ భత్యం, ఇంటర్నెట్, స్టేషనరీ వార్త పత్రికల కొనుగోలుకు వినియోగించాలని చెప్పారు. 8 మండల విద్యా వనరుల కేంద్రాలకు 360000 రూపాయలు మండల విద్యాశాఖ అధికారి ఖాతా లో జమ చేశామని చెప్పారు.

నాలుగు పాఠశాల ల్లో వృత్తి విద్యా కోర్సులను నిర్వహణ చేయడానికి 192000 రూపాయలు సంబంధిత ప్రధానోపాధ్యాయుల ఖాతా లో వేశామని చెప్పారు. సివిల్ వర్క్స్ గురించి 5668374 రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను పాఠశాల కు,విద్యార్థులకు లాభం కలిగేలా మార్గదర్శకాలకు అనుగుణంగా భాధ్యతయుతంగా ఖర్చు చేస్తూ సరైన పద్దతిలో రికార్డ్స్ నిర్వహణ ఉండాలని చెప్పారు.

Related posts

కలెక్టర్ కు వి ఆర్ ఓ పై గ్రామస్తుల ఫిర్యాదు

Bhavani

ఈ ఎర్రబస్సు ఇక బతికే అవకాశం ఏ మాత్రం లేదు

Satyam NEWS

సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

Satyam NEWS

Leave a Comment