29.7 C
Hyderabad
May 3, 2024 05: 18 AM
Slider ముఖ్యంశాలు

ఖరీదైన మద్యం బాటిళ్ల కార్టన్లతో పట్టుబడ్డ విలేకరి

journalist car

రిపోర్టర్ అంటే ఏం చేయాలి? వార్తలు సేకరించి తాను పని చేస్తున్న మీడియా సంస్థకు పంపాలి. అంతే కదా? ఇలా చేసే రిపోర్టర్లకు అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడటం సహజం. పోలీసులతో స్నేహం కుదరడం కూడా సహజమే. అయితే అధికారులతో, పోలీసులతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని చట్ట విరుద్ధమైన పనులు చేస్తామంటే ఊరుకుంటారా?

కచ్చితంగా ఊరుకోరు అనే ఒక సంఘటన హైదరాబాద్ లో జరిగింది. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొందరు తినడానికి తిండిలేకపోయినా సమాచారం అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు.

అయితే వేణుగోపాలరెడ్డి అనే ఈ రిపోర్టర్ మాత్రం జర్నలిస్టు ముసుగులో మద్యం అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు నిత్యం అటుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుంటారు.

వాహనంలో డ్రైవర్, మరొకరు తప్ప ఎక్కువ మంది ఉండకూడదు. ఇలాంటి నిబంధలనలను పాటిస్తున్నారా లేదా అని చెక్ చేస్తుంటారు. ఇలా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అటుగా వస్తున్న TS 08 GN 2525 వర్న కారు కనిపించింది. ఆపారు. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

వారిని కిందికి దించి డిక్కీ తెరవమన్నారు. ఇంకేముంది అందులో కళ్లు తిరిగే స్థాయిలో ఖరీదైన మద్యం బాటిళ్లు దొరికాయి. బ్లాక్ డాగ్ , సిగ్నేచర్ , బ్లాక్ అండ్ వైట్ మద్యం బాటిల్ ఉన్న కాటన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జరిగిన ఈ విషయం మొత్తం వారు వీడియో లో బంధించారు ఎందుకైనా మంచిదని. వారు అనుకున్నట్లే ఆ కారులో ఉన్నవ్యక్తి జర్నలిస్టు. తెలంగాణ గుండె చప్పుడు గా చెప్పుకునే టి న్యూస్ ఛానెల్ లోగో అతని చేతులో ఉంది. తనకు అధికార పార్టీలో అందరూ తెలుసునని, తనకు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని కూడా అతను తనిఖీ చేసిన పోలీసులకు చెప్పాడు కానీ వారు వినలేదు. కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసుకున్నా తనకేం కాదని తాను ఎలాగైనా కేసు నుంచి బయటకు వచ్చి తనపై కేసు పెట్టిన వారి సంగతి చూస్తానని కూడా అంటున్నాడు. ఇలా తరచూ మద్యం బాటిళ్లను అతను తీసుకెళ్లి వేరేవారికి ఎక్కువ ధరకు అమ్ముతుంటాడని ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

Related posts

ములుగు లో గర్జించిన గౌడన్న

Satyam NEWS

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

అంబేద్కర్ దళిత నేత కాదు దేశ నేత

Satyam NEWS

Leave a Comment