29.7 C
Hyderabad
May 2, 2024 05: 38 AM
Slider రంగారెడ్డి

నేటి యువకులే నేటి నవభారత నిర్మాతలు

#cbit

74వ గణతంత్ర దినోత్సవం సిబిఐటి లో ఘనంగా నిర్వహించారు. సిబిఐటి ప్రెసిడెంట్ ఎన్.సుభాష్ జాతీయ జెండాను ఎగురవేయడంతో  గణతంత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులను త్యాగ ఫలం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని దాని పర్యవసానమే గణతంత్ర భారతం ఏర్పడిందని వివరించి చెప్పారు.

ఈ తరం యువకులే దేశనికి నిర్మాతలు. మన దేశం గర్వపడేలా చేయడానికి ప్రతి పౌరుడి అంకితభావం తో పనిచేయాలి అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమని అన్నారు. ప్రజలకు సమానత్వ హక్కును కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ఒక అమూల్యమైన వారసత్వం. దీన్ని అవలంబించడం ద్వారానే మనం విశ్వగురువు కాగలం. సిబిఐటి స్థాపన ఉద్దేశ్యం అందరికీ ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందించడం అని ఆయన వివరించారు. దేశ నిర్మాణానికి మన వంతు సహకరించడం ద్వారానే  మన  భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా వుంచగలమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సిబిఐటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి, ఎంజిఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి, డైరెక్టర్లు, వివిధ విభాగాధిపతలు , సిబిఐటి, ఎంజిఐటి అన్ని విభాగాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంజీఐటీ కళాశాలలో ఎంజీఐటీ అధ్యక్షులు డి ప్రవీణ్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు.

Related posts

నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీవో సంఘానికి కొత్త కమిటీ

Satyam NEWS

ప్ర‌ణాళిక,పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

Satyam NEWS

అగ్లీ ఫెలో: స్టాఫ్ నర్స్ పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

Satyam NEWS

Leave a Comment