ఈ నెల 15న జరగనున్న సొసైటీ ఎన్నికల సంబంధించిన గ్రామాల వారిగా రిజర్వేషన్ల వివరాలను బిచ్కుంద మండల సొసైటీ ఎన్నికల అధికారి కిషోర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 7 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ 9 అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన 10న ఉపసంహరణ అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
మండలంలో 12 గ్రామాల గాను మొత్తం13 వార్డులు ఉండగా ఎస్సీ1, ఎస్టీ1 బీసీ 2 మహిళలకు 2 జనరల్ 7 కేటగిరీలకు కేటాయించమని, 15 నాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. వాలంటరీ అధికారి అబ్దుల్ అలీమ్, సీఈవో శ్రావణ్ రిజర్వ్ అధికారి శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.