29.7 C
Hyderabad
May 1, 2024 08: 56 AM
Slider ముఖ్యంశాలు

హిందువుల పండుగ‌ల‌పై విషం చిమ్మే ప్ర‌క్రియ‌

#Viswahinduparishad

హిందువుల పండుగల పై ఆంక్షల  వర్షం కురుస్తోంది. హిందువుల పండుగలు అంటేనే కాలుష్యంతో కూడిన వని దుర్మార్గమైన ప్రచారం సాగుతుండటం ఘోరం. సెక్యులర్ పేరుతో.. పర్యావరణం పేరుతో, హిందువుల ఆచార వ్యవహారాలపై.. పండుగ పబ్బాల పై అనవసరమైన రాద్ధాంతం సాగుతోంది. అర్థం పర్థం లేని చర్చలు జరుగుతున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు.
ప్రధానంగా దీపావళి హిందువులకు అతి పెద్ద పండుగ. అతి ప్రాచీన సంప్రదాయ ఆచారాలతో, నియమనిష్ఠలతో నిర్వహించే పవిత్రమైన పండుగ అన్నారు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని టపాసులు కాల్చితే శబ్ద కాలుష్యం.. వాయు కాలుష్యం ఏర్పడి మొత్తంగా పర్యావరణమే కలుషితమై, సృష్టి మునిగిపోతుందని హిందూ వ్యతిరేకులు ప్రచారం చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.

ట‌పాసులు పేల్చ‌డంతో కీటకాలు అంతం

వాస్తవానికి దీపావళి పండుగ రోజు ట‌పాసులు కాల్చడంతో క్రిమికీటకాలు చనిపోయి, అప్పటికే కలుషితమై ఉన్న ప్రదేశాలు పరిశుద్ధం అవుతాయి. ఎందుకంటే.. వర్షా కాలం ముగిసిన తర్వాత వచ్చే ఈ పండుగ సందర్భంగా అప్పటికే చిత్తడి గా మారి,  ఎక్కడికక్కడ పెరిగిపోయిన క్రిమికీటకాలు ప్రజలకు ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం తో క్రిములు చనిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సైంటిస్టులు కూడా చెప్పారు. మరీ ముఖ్యంగా ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా ఈ విష‌యంలో అస‌త్య ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు.

వాహ‌నాలు, ప‌రిశ్ర‌మ‌ల సంగ‌తేంటీ?

దీపావ‌ళి ట‌పాసుల పేల్చే కాలుష్యం కంటే రోజువారీగా వాహ‌నాలు, ప‌రిశ్ర‌మ‌లు నుంచే వెలువ‌డే కాలుష్య‌మే తీవ్ర‌స్థాయిలో ఉంద‌ని ఈ విష‌యంపై కూడా కోర్టులు సీరియ‌స్‌గా ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటే మాన‌వాళి మ‌నుగ‌డ‌ను కాపాడిన‌వార‌వుతార‌న్నారు. అది వ‌దిలేసి హిందూ పండుగ‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసే విధంగా వారి మనోభావాలతో చెలగాటం ఆడటం విచార‌క‌రం.

ఉపాధి అవకాశాలు మృగ్యం..?

ఏడాదంతా కొన్ని లక్షల మంది, వేలాది కంపెనీల్లో నిరంతరం కష్టపడి పని చేస్తేనే టపాసులు తయారీ అవుతాయి. కానీ… ఆ విషయం మరచి, ఉన్నఫలంగా టపాసులు నిషేధించాలంటూ నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వాలు.. కోర్టులు తీసుకుని ఈ దుందుడుకు ( హిందూ వ్యతిరేక) నిర్ణయాల వల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం లేకపోలేదు.!  దాంతోపాటు దీపావళి సందర్భంగా ఎక్కడికక్కడ క్రాకర్స్ అసోసియేషన్ వాళ్లు ప్రభుత్వ అనుమతి పొంది, లైసెన్స్ గా ప్రభుత్వ  నియమ నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకునే వాళ్ల పరిస్థితి  ఏమిటి .? అనే విషయం కోర్టులు ఆలోచించకపోవడం మరి అన్యాయం.!!

టపాసులు కాల్చడం దీపావళి ఒక్కరోజే నిషేధమా..?

సంబ‌రాలు నిర్వ‌హించుకునేట‌ప్పుడు, నాయ‌కులు గెలిచిన‌ప్పుడు, క్రికెట్ మ్యాచ్‌లు గెలుపోట‌ములు, పెళ్లిళ్లు పేరంటాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధంగా ట‌పాసులు పేలుస్తుంటార‌ని వాటివ‌ల్ల కాలుష్యం త‌లెత్త‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. దీపావళి రోజు నరకాసురుడు అనే రాక్షసుడిని వధించిన సందర్భంగా లోకమంతా సంతోషంతో సంబరాలు చేసుకోవడం..  టపాసులు కాల్చడం అనేది ఆనవాయితీ.. తరతరాలుగా వస్తున్న వ్యవహారం.! ఇది విశ్వహిందూ పరిషత్ గాని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కానీ తీసుకువచ్చిన  ఆచారం  ఎంత మాత్రం కాదు  అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టపాసులతో కరోనా వైరస్ అంతం?!

నేడు ప్రభుత్వాలు.. కోర్టులు.. సైంటిస్టులు చెప్పే విధంగా గాలిలో కరోనా వైరస్ ఉందంటే, టపాసులు కాల్చితే వైరస్ చనిపోతుంది. తద్వారా మానవాళి మనుగడకే మేలు కలుగుతుంది. అసలు వాస్తవం ఇది..! కానీ వాస్తవాన్ని కప్పిపుచ్చి, టపాసులు కాల్చితే గాలి కలుషితమై వైరస్ విస్తరిస్తుంది అనేది పచ్చి అబద్ధం. దాన్ని ఎంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని కప్పిపుచ్చి హిందువుల మనోభావాలను గాయపరచడం కోసం చాలామంది మేధావులుగా చెప్పుకునేవారు పండుగలపై విషం నింపి మాట్లాడడం హేయం. హిందువుల ప్రతి పండుగలో సంస్కృతి.. సంప్రదాయం.. పర్యావరణం.. వాతావరణ సమతుల్యం మిలిత మై వుంటాయనేది నగ్నసత్యం. హిందువుల పండుగలు అన్నింటిలో కూడా సైన్స్ కలిసి ఉంటుంది. దీపావళి పర్వదినాన ప్రతి హిందువు తప్పకుండా టపాసులు కాల్చాలి.. గాలిలోని క్రిమికీటకాలను అంతం చేయాలి.

పగుడాకుల బాలస్వామి, సహ ప్రచార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్

Related posts

మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం: అమిత్ షా

Satyam NEWS

వడ్డేపల్లి సాహిత్య ప్రస్థానం స్ఫూర్తి దాయకం

Satyam NEWS

డోకిపర్రులో గోదాదేవి కల్యాణానికి హాజరైన చిరంజీవి దంపతులు

Satyam NEWS

Leave a Comment