39.2 C
Hyderabad
April 28, 2024 12: 25 PM
Slider ఆధ్యాత్మికం

మూడు రోజుల పండుగ దివ్యజ్యోతి దీపావళి

#Diwali

భారతీయ సాంప్రదాయం ప్రకారం భారతదేశం లో చాలా పండగ లు ప్రసిద్ధి లో ఉన్నాయి. అలాంటి పండుగలలో ముఖ్యమైనవి దసరా,దీపావళి, శివరాత్రి, శ్రీరామనవమి, వినాయకచవితి మొదలైనవి. ఇలా కొన్ని పండుగలను ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా జరుపుకుంటారు.

ఉపవాసలకు, జగరణలకు, వ్రతeలకు ప్రాధాన్యతనిచ్చే వినాయకచవితి, శ్రీరామనవమి, వరలక్ష్మీ వ్రతం,శివరాత్రి ,వైకుంఠ ఏకాదశి మొదలైన పండగలను మనం జరుపుకుంటున్నాం. ఇందులో ఒక పండగ దీపావళి. ఈ పండగను సర్వజన సమైక్యతకు ప్రతీకగా జరుపుకుంటున్నాం.

మనలోని అజ్ఞానందకారాన్ని పారద్రోలి భవిష్యత్ కు బంగారు బాటవేసేలా మన జీవితాలలో కోటి వెలుగులు నింపే పండగ దీపావళి.

ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ కృష్ణ చతుర్దశి రోజున “నరకచతుర్దశి” అని మరునాడు దీపావళి అమావాస్య అని అత్యంత వైభవంగా జరుపుకునే  పండగే దీపావళి.అసలు దీపావళి పండుగ జరుపుకోవడానికి పలురకాల పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

శ్రీరాముడు రావణుడి ని వదించాక సీత,లక్ష్మణ, ఆంజనేయ సమేతుడై పట్టాభిషిక్తుడైన సందర్భంగా ను….మరొకటి శ్రీకృష్ణుడు నరకుడిని సంహరించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు అని ఇంకా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇది మూడు రోజుల పండుగ

నరక చతుర్దశి ,దీపావళి పేరిట రెండు రోజుల పండుగగా మనకు కనిపిస్తున్నపటికి నిజానికి ఇది మూడురోజుల పండగ. ఈ రెండు రోజుల కు ముందున్న రోజుని “బలి త్రయోదశి” అంటారు.ఈ రోజు ఉదయం లాగే సాయంత్రం కూడా తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేస్తారు.కానీ అది ఎలాగంటే ..

కుటుంబ సభ్యులంతా పూజా మందిరంలో కూర్చొని కుటుంబ పెద్ద దీపాన్ని వెలిగిస్తారు.పూజముగిసాక కుటుంబం అంత సుఖసంతోషాలతో ఉండేవిధంగా ఎలాంటి కష్టాలు,దోషాలు ,ఏ గ్రహాపు అశుభ వీక్షణ పడకుండా ఉండేలా బ్రాహ్మణ కి దానమియడానికి ఒక దీపం,గుడిలో వెలిగించడానికి మరోదీపం ను తీసుకోవాలి.

దీపాన్ని కూడా స్వచ్ఛమైన మెత్తిప్రమిధలో చక్కని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి పత్తి తో చేసిన వత్తి తో వెలిగించాలి. భారతీయ సాంప్రదాయం లో ప్రతి తంతు వెనక ఒక ఆరోగ్య రహస్యం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.

ఆవునేతి దీపం వెలుగు మంచిది

దీపం వెలిగించిన తర్వాత జరిగేది దాన్ని మన కన్ను చూడడం కధ!ఏ దీపపు కాంతి మన కంట్లో పడితే అది మనకు హానికరం కాదో…. ఆ విషయాన్ని గురించి పరిశోధించిన ఋషులు ఆవునేతి దీపం శ్రేష్టమని,నువ్వుల నూనె దీపం శ్రేష్టమని చెప్పారు.

ఇక మరునాడు అనగా రెండవ రోజు నరక చతుర్దశి. ఈ రోజు తెల్లవారు జామునే నిద్రలేవాలి.ఏమాత్రం అవకాశమున్న నది స్నానం చేయగలిగితే మంచిది. ఇలా తెల్లవారు జామున స్నానం చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.

పూర్వం అంగీరసుడు మొదలైన మహర్షులు అంతా తాము భూలోకంలో తపస్సు చేసి ఆర్జించిన తపశ్శక్తిని నదులలో కలిపి వెళ్తూ ఎవరు ఈ నదుల్లో స్నానాన్ని చేస్తే వారికి,వారివారి భక్తికి తగినట్టుగా తపశ్శక్తి సంక్రమిస్తుంది అని చెప్పారట.

ఆ కారణంగా  మహర్షుల తపశ్శక్తి సహజంగానే నీళ్ల లో ఉండే వరుణ దేవుని శక్తి,ఉదయించ బోతున్న సూర్యుని  ఉషాకిరణ శక్తి, అమవాస్యకి చేరువైన కారణంగా చంద్రుడు కూడా ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి ఆ చంద్రుని శక్తి బ్రాహ్మీ ముహూర్తం ఐన కారణంగా ఆకాశగంగలో స్నానానికి వెళ్లబోతున్న ఆకాశగాములైన మహర్షుల దర్శన కారణంగా వారి అనుగ్రహ శక్తి…..అన్ని ఈ ఒక్క నాటి స్నానంతో లాభిస్తాయి.

సహజంగా నరక చతుర్దశి స్వాతి నక్షత్రం ఉన్న రోజున వస్తుంది. అంటే నేటి స్నానం గంగా స్నానంతో సమానం.తర్వాత అప్పటికే సిద్ధం చేసుకొని ఉన్న నరకుని బొమ్మని తగలవేస్తారు.అసలు నరకుడేవారు?అతన్ని దహనం చేయాల్సిన అవసరం ఏమిటి?అనే విషయానికొస్తే………

నరకుడు భూదివి కుమారుడే

శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించేందుకు వరాహావతరం ఎత్తి నీటమునిగి ఉన్న భూదేవిని ఉద్ధరిస్తాడు. రాక్షసుడిని సంహరిస్తాడు. అప్పుడు శ్రీహరికి భుదేవికి జన్మించిన శిశువు ఈ నరకుడు.

నరకుడు బ్రాహ్మ దగ్గర తన తల్లి చేత తనకు మృత్యువు రావాలని వరం పొందుతాడు. ఏ తల్లి బిడ్డను చంప లేదన్న ధీమా అతనికి. దానితో నరకుడు అన్ని ఆకృత్యాలను చేస్తాడు. శ్రీకృష్ణుడు దుష్టశిక్షణ, శిష్ట రక్షణల కోసం భూదేవి అంశ ఐన తన భార్య సత్యభామతో కలసి నరకుడిపై దండెత్తి వెళ్లడం జరుగుతుంది.

సత్యభామ యుద్ధం చేసేలా చేస్తాడు శ్రీకృష్ణుడు.అలా తల్లి చేతిలో హతుడవుతాడు నరకాసురుడు.అతని మరణం వల్ల జగత్తుకు శుభం జరిగింది కాబట్టి దాని గుర్తుగా అందరూ పండగ చేసుకునే వరం ఇమ్మని శ్రీకృష్ణుని భూదేవి కోరుకుంటుంది. అతని వధ అందరికి గుర్తుండిపోయేలా ఈ రోజు నరక చతుర్దశి ని ,మరునాడు దీపావళి ని జరువుకోవాల్సిందిగా శ్రీకృష్ణుడు చెప్పాడన్నది పురాణగాధ.

దీపాల వరుసలు

ఇక ఈ పండుగలోని మూడోవ రోజు అనగా చివరి రోజు దీపావళి.”దీప అనగా దీపాల యొక్క,ఆవళి అనగా వరుస”అని దీపావళి అనే మాటకు అర్థం.ఈ రోజు ఉదయం కూడా చక్కగా స్నానమాచరించి గడచిన రెండురోజుల లాగే బ్రాహ్మణునికి దానం చేయాలి.ఈ రోజు ప్రత్యేకంగా దేవాలయాలు, గృహాలు దీపాల సమూహంతో నిండి పోతాయి.

ఇంకా ఈ రోజున సాయంకాలం కొందరు కేదారేశ్వర వ్రతం అనే నోము నోస్తారు. ఈ రోజు లక్ష్మీ పూజ చాలా విశేషమైనది,ముఖ్యమైనది.ఈ ఆశ్వేయుజ మాసంలో బ్రాహ్మ భార్య సరస్వతి కి మూలా నక్షత్రం రోజున,శివుడి భార్య పార్వతికి విజయదశమి రోజువరకు పూజలు జరుగుతాయి. కానీ త్రిమూర్తుల భార్యాల్లో ఒకరైన విష్ణుపత్ని లక్ష్మిదేవికి పూజ జరగలేదు కదా! కావున ఈ నాటి రాత్రి లక్ష్మీ పూజని తప్పక చెయ్యాలి.

సంధ్యా సమయం దీపాల వెలుగు

మహిళా మణులంతా ఆశ్వేయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం మొత్తం సంధ్యాసమయంలో దీపాలను వెలిగిస్తారు. ఇంకా కార్తీక పౌర్ణమి కి నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి దీపాలను నదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి,సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం.

దీపావళి లక్ష్మీదేవి పండుగ

దీపావళి నాడు లక్ష్మీదేవి నదులలో, బావులలో, చెరువులలో మొదలైన నీటి వనరులలో గంగా దేవి సూక్ష్మ రూపములో నిండి ఉంటారు.కనుక ఆ రోజు నువ్వుల నూనె తో  తలంటుకొని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి.

ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది.గంగానది స్నానఫలం లభిస్తుంది.నరకభయం ఉండదనేది పురాణాలు చెబుతున్నాయి.

పంచభూతలలో ప్రధానమైనది అగ్ని.ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును,ఆహారాన్ని ఐహికంగాను,విజ్ఞానాన్ని ఆద్యాత్మికముగా ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలుగు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరిస్తాయి.నీలం, పసుపు, తెలుపు.ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమై సత్వరజస్తమో గుణాల సమ్మేళనం గా ఆర్యులు చెబుతుంటారు.ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మీ,సరస్వతి, దుర్గాలుగా భావిస్తారట పౌరాణికులు.

దీపావళి పిల్లల పండుగ

ఇక దీపావళి నాడు పిల్ల సంతోషం అంతాఇంతా కాదు.ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా,ఎప్పుడెప్పుడు టపాసులు పేల్చాలా అని ఆనందంగా ఎదురుచూస్తారు. పిల్లల్ని సంతోషపరిచేవిధంగా చిన్న చిన్న మతాబులు మాత్రమే వారికి ఇవ్వాలి.

ఎక్కువ రసాయనాలతో తయారు చేసిన టపాసుల వలన కలిగే అనర్ధం అనగా గాలి కాలుష్యం,శబ్ద కాలుష్యం గురించి పర్యావరణ కాలుష్యం గురించి తెలియజెప్పాలి. ఇలా చేయడం వలన పర్యావరణాన్ని కాపడేవిషయంలో మనవంతు సాయం చేసిన వారం అవుతాం.

కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.మస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటిద్దాం. వీలైతే టపాసులు కల్చకుండా ఇంట్లొనే ఉండి సంతోషంగా దీపావళి పండగని జరుపుకుందాం.

-టి. సంయుక్తా కృష్ణమూర్తి, M.C.A,M.ED, కరీమబాద్, వరంగల్లు.

Related posts

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS

వత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్ధంకండి

Satyam NEWS

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో చలివేంద్రం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment