39.2 C
Hyderabad
April 28, 2024 11: 54 AM
Slider రంగారెడ్డి

కార్మిక వ్య‌తిరేక చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాలి ఏఐటీయూసీ

Thandoor

కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ వికారాబాద్ జిల్లా తాండూర్ కన్వీనర్ విజయలక్ష్మి పండిత్ పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు.

అనంతరం కార్మికులందరూ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి వినతి పత్రo అందజేశారు. ఈ సందర్భంగా విజ‌య‌లక్ష్మీ మాట్లాడుతూ.. సమాన పనికి, సమాన వేతనం కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు గోపాల్ , గోరెప్ప, నర్సింలు, అశోక్, విజయ్, సిపిఐ నాయకులు అబ్దుల్లా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంచలనం సృష్టించిన గంధం చంద్రుడు…. విశాఖ పోస్టింగ్

Satyam NEWS

కుత్బుల్లాపూర్ రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి

Satyam NEWS

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

Bhavani

Leave a Comment