42.2 C
Hyderabad
April 30, 2024 16: 26 PM
Slider ప్రత్యేకం

ఉమ్మడి మాచారెడ్డిలో రేపు రేవంత్ రెడ్డి ప్రచారం

#revanthreddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి షబ్బీర్ ఆలితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ ను ఆ పార్టీ నాయకులు విడుదల చేసారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ ను బలంగా ఢీకొనేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిసి డిక్లరేషన్ కూడా విడుదల చేసారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు ఆయన కామారెడ్డి నియోజకవర్గంలోని ఉమ్మడి మాచారెడ్డి మండలంలో ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రెడ్డిపేట, 5 గంటలకు ఇసాయిపేట, 6 గంటలకు మాచారెడ్డి చౌరస్తా, 7 గంటలకు చుక్కాపూర్, 8 గంటలకు ఫరీద్ పేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డ దొంగా నాపై పోటీ చేస్తాడట అంటూ చేసిన వ్యాఖ్యలపై బిసి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈడి, సిబిఐ విచారణకు సీఎం కేసీఆర్ లేఖ రాయాలని, విచారణకు తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా అని సవాల్ చేసారు. 24 గంటల్లో తన సవాలుపై స్పందించాలని లేకపోతే కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని సూచించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. అయితే రేపు నిర్వహించే ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పై ఎలా స్పందిస్తారు.. అనేది వేచి చూడాలి. రేపటి ప్రచార కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించాల్సిన రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ప్రచారం చేస్తారా అనే అనుమానాలు ఇప్పటివరకు ఉండేవి. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారని రేపటి కార్యక్రమం ద్వారా అనుమానాలకు తెరపడింది. నియోజకవర్గంలో ఉమ్మడి మండలాల వారిగా సమయాన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

Satyam NEWS

తిరుగుబాటు ఎంపి రఘురామపై విష ప్రయోగం జరిగిందా?

Satyam NEWS

పోలీసులకు డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకెట్స్

Satyam NEWS

Leave a Comment