39.2 C
Hyderabad
May 3, 2024 12: 41 PM
Slider వరంగల్

Succus story: 100 శాతం హాజరు ప్రయోగం తో సత్ఫలితాలు

#barigalapally

100 శాతం హాజరు ప్రయోగం తో ములుగు జిల్లా బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల సత్ఫలితాలు సాధిస్తున్నది. బరిగలపల్లి లో పాఠశాల లో 100 శాతం హాజరు ను వినూత్న రీతిలో ప్రోత్సహిస్తున్నారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న మాట్లాడుతూ 100 శాతం హాజరు ఐన ప్రతీ ఒక్కరికీ వివిధ రకాల బహుమతుల రూపంలో ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

దీని వలన విద్యార్థుల లో పోటీ తత్వం పెరగడం, అదే విధంగా రోజు పాఠశాల కు క్రమం తప్పకుండా రావడం వల్ల వారి లో అన్ని విషయాల పై అవగాహన పెరుగుతుందని అన్నారు. పాఠశాల లో నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ఈ పాఠశాల లో కూడా ప్రతీ నెలా క్రమం తప్పకుండా హాజరు ఐన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతున్నదన్నారు.

ఈ బహుమతుల ను పాఠశాల చైర్మన్ కాయిత రమేష్, వైస్ చైర్మన్ ఉడుత సరిత హరికిషన్ విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, విద్యార్థులకు తరగతి సంబంధించిన విషయాల తో పాటు ప్రతీ రోజూ ఆటలు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం ( సహ పాఠ్య అంశాలు) బాగుందన్నారు. అదేవిధంగా విద్యార్థుల కు ప్రతీ పరీక్ష లో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించడం వారికి బహుమతులు అందజేయడం మంచి ఆలోచన అన్నారు.

పాఠశాల సహచర ఉపాద్యాయులు పోరిక రతన్ సింగ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు గా మీరు మీ పిల్లల ను క్రమం తప్పకుండా బడికి పంపడం మరియు మేము ఇచ్చిన ఇంటి పని పూర్తి చేయించడం ముఖ్యమైనది అన్నారు. దాంతో విద్యార్థులు  తప్పకుండా అన్ని రకాల విషయాలలో ముందుటారన్నారు.

ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా 100 శాతం హాజరు ఐన విద్యార్థులైన వర్షశ్రీ-2వ తరగతి,మోక్షశ్రీ,జయవర్ధన్-3వ తరగతి, చిరు హాసన్, సుశాంత్, శ్రీనాథ్-4 వ తరగతి, అశ్విని, మనోజ్ కుమార్-5వ తరగతి , మొత్తం 6 గురి కి బహుమతులు లను చైర్మన్ కాయిత రమేష్, వైస్ చైర్మన్ ఉడుత సరిత హరికిషన్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంకా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉడుత హరికిషన్,వీరబోయిన రాజెందర్, లక్ష్మన్, నరేష్, సుమలత, శ్రీలత,అనూష, స్వప్న,రమ్య, ఎల్లమ్మ,కొమురమ్మ లు పాల్గొన్నారు.

Related posts

విశాఖపట్నం జర్నలిస్టుల సంక్షేమానికి చేయూత

Satyam NEWS

రాష్ట్ర రవాణా సంస్థకు రాజకీయ గ్రహణం

Satyam NEWS

క్రీడలతో పోలీసు ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి

Satyam NEWS

Leave a Comment