29.7 C
Hyderabad
April 29, 2024 10: 41 AM
Slider రంగారెడ్డి

నిరుపేదలకు వరాలిచ్చిన రైస్ బకెట్ ఛాలెంజ్

#RiceBucketChallenge

హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుండి సుమారు 25 మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇతర నిర్వాహక సిబ్బంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైస్ బకెట్ ఛాలెంజ్ ప్రచారాన్ని చేపట్టారు.

కళాశాల పరిసరాల్లోని కొన్ని నిరుపేద కుటుంబాలకు సుమారు 250 కిలోల బియ్యం దానం చేసారు. పరిశోధనా సంస్థలో మహిళా దినోత్సవ వేడుకలకు రైస్ బకెట్ ఛాలెంజ్ వ్యవస్థాపకురాలు మంజులత కళానిధిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కోవిడ్-19 సమయంలో రైస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ ఫౌండర్‌ ఫౌండర్‌, జర్నలిస్ట్‌ మంజులత కళానిధిని అసాధారణ ప్రయత్నాలతో సమాజానికి సేవలనందించారు. 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ సంవత్సరంలో విధించిన కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఏర్పడిన సంక్షోభానికి, నిరుపేదలు దాదాపుగా వారి ఉపాధిని కోల్పోవడం,అదే రకంగా చాలా మంది నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు శిరోభారంగా మారిన తరుణంలో, వారిని ఆదుకోవడానికి రైస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ ద్వారా 18 లక్షల రూపాయల తమ వంతు సహాయంతో పోగు చేసిన 27వేల కేజీల కిరాణా సరుకులను సమీకరించడంతో పాటుగా పంపిణీ చేశారు.

Related posts

అయ్యప్పలతో కిక్కిరిసి పోతున్న శబరిమల

Satyam NEWS

రవితేజ డిస్కో రాజా తొలి సాంగ్ విడుదల

Satyam NEWS

ప్రజా సంక్షేమానికి… ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment