ఇటుక బట్టి యజమాని సిద్దయ్యను కిడ్నాప్ చేసి 8.5 లక్షల రూపాయలు తీసుకుని పరారైన కిడ్నాపర్లను పట్టుకుంటామని రామగుండం పోలిస్ కమీషనర్ వి.సత్యనారయణ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కిడ్నాప్ జరగగా నేడు పోలిస్ కమీషనర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఎవరిపైన ఐనా అనుమానం ఉన్నదా, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, గతంలో ఇటుక బట్టీల వద్ద కాని, ఇంటి వద్ద గాని ఎవరైన అనుమానంగా కనిపించారా, అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కారులో ఉన్న సమయంలో వారు ఏ భాషలో ఎక్కవగా మాట్లాడారు, ఇంకెవరికైనా ఫోన్ లో మాట్లాడారా అప్పుడు ఏ బాష లో మాట్లాడారు సిద్దయ్య ని అడిగి తెలుసుకొన్నారు. నిందితులను పట్టుకుంటామని బాధితుల కు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే కిడ్నాప్ కేసును చేదిస్తామన్నారు.
previous post