27.7 C
Hyderabad
April 30, 2024 10: 15 AM
Slider ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ముఖ్యం

nirmal police

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల ఆవశ్యకత గురించి రహదారి భద్రతాపై అవగాహన కల్పిస్తూ, రహదారి భద్రత వారోత్సవాల సందర్బంగా ఆటో డ్రైవర్స్ లకు, లారీ డ్రైవర్ లకు, వాహన దారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు.

31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.కె కన్వెన్షన్ హాల్ లో ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలను అధిక  వేగంగా నడిపి ప్రమాదాలకు కారకులుగా మారవద్దని సలహా ఇచ్చారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ గా వెళ్లడం, ముందు, వెనుక వాహనాలను చూసుకోకుండా ఓవర్ టెక్ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబ యజమాని చనిపోతే దాని పర్యవసానం రెండు మూడు తరాల వారికి దాని ప్రభావం పడుతుందని రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ పట్టణ సి.ఐ జాన్ దివాకర్, సొన్ సి.ఐ. జీవన్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై, ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్, వాహన దారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Satyam NEWS

మోడీకి వీసా తిరస్కరించిన దేశమేనా అది?

Satyam NEWS

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వారు పట్టువదలని విక్రమార్కులు

Satyam NEWS

Leave a Comment