30.7 C
Hyderabad
April 29, 2024 06: 49 AM
Slider ముఖ్యంశాలు

ట్రాఫిక్ ఆంక్షలు

#traffic

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. నవంబర్ 1వ తేదీన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను తొండపల్లి టోల్‌గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్డు, రాళ్లగూడ జంక్షన్, ఎయిర్ పోర్టు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, రైట్ టర్న్, ఓఆర్‌ఆర్ అండర్‌పాస్, సింపులెక్స్ జంక్షన్, లెఫ్ట్ టర్న్ తీసుకుని సాతమరాయ్ , గగన్‌పహాడ్ నుంచి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా  నగరం లోకి రావాలి. బాలనగర్ ట్రాఫిక్ పిఎస్‌లో  2వ తేదీ ఉదయం 6గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోయిన్‌పల్లి నుంచి బాలానగర్ వచ్చే వాహనాలను బోయన్‌పల్లి జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతం నగర్, శోభనా జంక్షన్ ద్వారా , బోయిన్‌పల్లి నుంచి బాలానగర్ నుంచి వచ్చే వాహనాలను ఫేరోజ్‌గూడ జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు, గౌతం నగర్, శోభన జంక్షన్ వైపు మళ్లిస్తారు.

బోయిన్‌పల్లి నుంచి కూకట్‌పల్లి వచ్చే వాహనాలు బాలానగర్ ఫ్లైఓవర్, ఐడిపిఎల్ హట్స్, కూకట్‌పల్లి వై జంక్షన్ వైపు, కూకట్‌పల్లి మీదుగా బోయిన్‌పల్లి వచ్చే వాహనాలను నర్సాపూర్ జంక్షన్, లెఫ్ట్ టర్న్, గుడెన్‌మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, కుత్బుల్లార్ విలేజ్, సుచిత్ర జంక్షన్ నుంచి రైట్న్ తీసుకుని బోయిన్‌పల్లి వైపు మళ్లాలి. కూకట్‌పల్లి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో నవంబర్ 2వ తేదీన ఉదయం 6.30 నుంచి 8.30 గంటలకు, కెపిహెచ్‌బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆంక్షలు విధించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.

Related posts

సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష

Bhavani

మీడియా పేరు చెప్పాడు… దోపిడి చేస్తున్నాడు

Satyam NEWS

పాదాలు

Satyam NEWS

Leave a Comment