38.2 C
Hyderabad
April 29, 2024 20: 02 PM
Slider ఆదిలాబాద్

గ్రామీణ క్రీడలకు పెద్ద పీట కేంద్ర క్రీడా శాఖ మంత్రి

Sports

కోవిడ్-19 కారణంగా గత తొమ్మిది నెలలుగా దేశవ్యాప్తంగా క్రీడాపోటీలు శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోయాయని త్వరలోనే పునరుద్ధరించి క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కీరెన్ రిజీజు అన్నారు. తెలంగాణలో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో సైతం క్రీడ రంగాన్నిఅభివృద్ధి పరచి గ్రామీణ క్రీడలను వెలికి తీస్తామని అన్నారు. శనివారం ఉదయం కేంద్ర క్రీడా మంత్రి కిరేణ్ రిజిజుని ఎంపీ సోయం బాపు రావు కలిసి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గ్రామీణ క్రీడలను ఆదరించాల‌న్నారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి మహారాష్ట్ర చత్తీస్ఘడ్ తెలంగాణ ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన క్రీడలకు తగిన ఆదరణ కల్పించి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తామని జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేలా క్రీడా రంగాన్నిమరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆదివాసీల కోసం ఆర్చరీ అకాడమీ నెలకొల్పలా ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపూరావు కేంద్ర మంత్రికి వినతి పత్రాన్నిసమర్పించారు.

Related posts

భూముల్ని బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

కాంబోజి లక్ష్మీదేవి మరణించినా ఆమె కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి

Satyam NEWS

మహిళా బిల్లు ను పక్కదారి పట్టిస్తున్నారు

Bhavani

Leave a Comment