36.2 C
Hyderabad
April 27, 2024 22: 23 PM
Slider ఖమ్మం

దళిత బంధు అమలుకు పకడ్బందీ చర్యలు

measures for the implementation of dalitbandhu

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సందర్భంగా దళిత బంధు పూర్తి స్ధాయిలో అమలు పై ఖమ్మం గట్టయ్య సెంటర్లో ని డి‌పి‌ఆర్‌సి భవనంలో  ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతి దళిత కుటుంబం ఆర్ధికపురోగభివృద్ది సాధించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ పథకం రూపకల్పన చేసిందని వివరించారు. ఎవరుఏ యూనిట్ పెట్టుకోవాలన్న అభ్యంతరం లేదన్నారు. అయితే పెట్టె యూనిట్ పై అనుభవం ఉంటే బావుంటుంది అన్నారు.  అందరు ఒకే తరహా యూనిట్ లు పెట్టకుండా వివిధ రంగాలను ఎంపిక చేసుకుని, వాటిలో కలిగే ఇబ్బందులు, ప్రయోజనాలు చెప్పాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు చూ స్కోవాలన్నరు.

చింతకాని మండలంలోని 25గ్రామాల్లో పూర్తి స్ధాయిలో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నరు. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్(రేషన్ కార్డు), ఆధార్ కార్డు ఆధారంగా  ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఏక్కడ ఎలాంటి అవకతవకలు జరుగకుండా, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింపజేసెందుకే ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించినట్టు చెప్పారు.  ఏదైనా మంచి పని చేసినప్పుడు కొన్ని దుష్ట శక్తులు  వస్తూనే ఉంటాయని అన్నారు. చేస్తున్న పని ప్రజలకు ఉపయోగపడేది అయినపుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ఆయా స్పెషల్ ఆఫీసర్స్ల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో  ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ గౌతం, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి , జెడ్‌పి చైర్మన్ కమల్ రాజ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్‌

Murali Krishna

5వ డివిజ‌న్ పోలింగ్ ప్ర‌క్రియను‌ ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

ఎన్నికల కోసం మద్యం స్మగ్లింగ్ చేస్తున్న వైసిపినేత కొడుకు

Satyam NEWS

Leave a Comment