Slider నల్గొండ

అక్టోబర్ 1న నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

#pasyapadma

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో సోమవారం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 1న,నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే రెండవ తేదీ నుండి నీటి విడుదలకు రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.

ఎడమ కాలువకు శాశ్వతంగా నీటి సరఫరా చేయటానికి మూసీ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి లిఫ్టుల ద్వారా అనుసంధానం చేయాలని అన్నారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం గురించి వ్రాతపూర్వకంగా రైతులకు ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందారని అన్నారు.అందుకే రైతాంగం తిరిగి ఉద్యమాన్ని ప్రారంభించడానికి సమాయత్తమై అక్టోబర్ మూడవ తేదీన లకీంపూర్ కేరీ దుర్ఘటనకు నిరసనగా కార్యక్రమాలను జిల్లా కేంద్రాలలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బహుళ రాష్ట్ర సంఘాల సవరణ చట్టం 2023 లోని సెక్షన్ 26 ద్వారా సహకార సంఘం లోని వాటాలను ఇతర పెట్టుబడిదారులకు అమ్మవచ్చునని సెక్షన్ 63 ద్వారా సహకార సంస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుందని అందుకే పై చట్టాన్ని రద్దు చేయాలని పశ్యా పద్మ డిమాండ్ చేశారు. అక్టోబర్ 10వ,తేదీన అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు ఇవ్వాలని కోరారు.వచ్చే నవంబర్ 26’27’28వ, తేదీలలో హైదరాబాదులో మూడు రోజులపాటు మహా ధర్నాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు.ప్రభుత్వం ప్రకటించిన ఋణమాఫీని తక్షణమే అమలు చేసి రైతులకు క్రొత్త ఋణాలు మంజూరు చేయాలని కోరారు.తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డా వెంకటయ్య రైతు సంఘం నివేదికను ప్రవేశపెట్టారు.

ఈ కార్యక్రమంలో బొల్లు ప్రసాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, అన్నెం పాపిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం హుజూర్ నగర్ మండల కార్యదర్శి పొనుగుపాటి వాసుదేవరావు, తెలంగాణ రైతు సంఘం హుజూర్ నగర్ పట్టణ కార్యదర్శి మామిడి నరసయ్య, రైతు సంఘం నాయకులు పుట్టపాక అంజయ్య,ముక్కా వీరబాబు, గొట్టెముక్కల కోటి నారాయణ,కత్తి శ్రీనివాసరెడ్డి,గంగిరెడ్డి కోటిరెడ్డి,కొప్పుల సురేందర్ రెడ్డి,సాయిలు గౌడ్,దొడ్డా పార్వతి,చలంరాజు అంజయ్య,డి.లక్ష్మి, అనంతు వీరబాబు,కారింగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

గిరిజన రిజర్వేషన్ లకు కాంగ్రెస్ పార్టీ నేత రంగినేని మద్దతు

Satyam NEWS

లాక్ డౌన్ వేళ ఐఐటీ-జేఈఈ, నీట్ ఆన్ లైన్ మాక్ టెస్టులు

Satyam NEWS

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

Leave a Comment