38.2 C
Hyderabad
April 27, 2024 16: 42 PM
Slider మహబూబ్ నగర్

ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదికలను వెంటనే ఇవ్వండి

#sandreach

జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లను ఇటీవల జిల్లాస్థాయి కమిటీ పరిశీలించిన ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే నివేదికను వెంటనే ఇవ్వాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ యం.మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ తన ఛాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో దాసర్లపల్లి, మొల్గర, డిండి చింతలపల్లి మిట్ట సదాగోడు, మెడిపూర్ ఇసుక రీచ్‌లను గుర్తించిన జాయింట్ పరిశీలన నివేదికలను వెంటనే అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తాడూరు మండల పరిధిలోని నేరెళ్ల పల్లి, పాపగల్, ఆకు నెల్లికుదురు,అలాగే ఆకు నెల్లికుదురు మెడిపూర్ సమీపంలో, మెడిపూర్ వాగులు, చెక్ డ్యాముల్లో 6  రీచ్‌లు గుర్తించి మన ఇసుక మన వాహనం ద్వారా సరఫరా చేసేందుకు టి ఎస్ ఎం డి సి లిమిటెడ్ వారికి త్వరలోనే  అప్పగించేందుకు కావాల్సిన పర్యావరణ అనుమతులు, నివేదికలను రెండు రోజుల్లో అందజేయాలని ఏడి మైనింగ్ రఘురాం రాజు ఆదేశించారు.

వంగూరు ఉప్పునుంతల మండల పరిధిలో నూతన  ఇసుక రీచ్ల తవ్వకాలకు అనుమతిచ్చేందుకు  చట్టం ప్రకారం అవకాశం  అనేదానిపై ఈనెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయా మండలాల జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసి లతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా గుర్తించిన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను మన ఇసుక వాహనం ద్వారా తరలింపు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి దాపరికం ఉండకూడదన్నారు. ఇసుకను తరలించేందుకు ఎంపిక చేసిన ట్రాక్టర్లను తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు గా మార్చుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ఇసుక పంపిణీ జరిగేలా అన్ని అనుమతులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలను పటిష్టం చేయాలన్నారు.

నెల, మూడు నెలలకు ఎంత ఇసుక అవసరం అవుతుందో ముందుగా ప్రణాళిక రూపొందించాలన్నారు.అందుకు కావాల్సిన ఇసుక డంపింగ్ చేసేందుకు ప్రైవేటు రైతుల స్థలాలను లీజుకు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మైనింగ్‌ ఏడీ విజయరామరాజు, టీఎస్ ఎండిసి, శ్రీనివాస్, డి పి ఓ రాజేశ్వరి, నీటిపారుదల ఈఈ మురళి, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్, ఆర్టీవో ఎర్రి స్వామి, గ్రౌండ్‌ వాటర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ఆన్లైన్ ప్రదర్శన

Satyam NEWS

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

Satyam NEWS

షూటింగ్ ఛాంపియన్ ఈశాసింగ్ కు అభినందన

Satyam NEWS

Leave a Comment