36.2 C
Hyderabad
April 27, 2024 21: 39 PM
Slider ప్రత్యేకం

లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

#ktr

2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు తెలిపారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు

తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వలన తక్కువ లోక్ సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరం అన్నారు. మరోవైపు కేంద్ర

ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని, ఇది దురదృష్టకరమన్నారు.

జనాభా నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు తీవ్రంగా తమ ప్రగతిశీల విధానాలకు శిక్షించబడుతున్నాయన్నారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి

సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని, కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35% జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయన్నారు. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్ సభ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదన్నారు.

తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు గళమెత్తాలన్నారు.

Related posts

కొత్తపేట నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వైసీపీ

Satyam NEWS

ప్రభుత్వం ఏర్పాటు చేసే కంటి వెలుగు సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

శాంతి స్థాపనలో ఆఫ్ఘన్ కు భారత్ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment