కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేషన్స్ నూతన మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్ నియమితులయ్యారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామ్‌సంగ్ వైస్ చైర్మన్‌ను అరెస్టు చేసిన తరువాత పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిపిన మొదటి కొత్త నియామకం ఇది.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చోయి క్యుంగ్-సిక్ మొబైల్ డివిజన్ స్ట్రా టజిక్ మార్కెటింగ్ ఆఫీస్ హెడ్ గా పదోన్నతి పొందారు. ఇంతకు ముందు ఉన్న లీ సాంగ్-చుల్ సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియన్ ఆపేరేషన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అతనిని తిరిగి నియమించారు. కోహ్ డాంగ్-జిన్ సామ్‌సంగ్ సంస్థ ప్రతినిధి స్మార్ట్ ఫోన్ బిజినెస్ అధిపతిగా కొనసాగుతున్నారు. దక్షిణ కొరియా సంస్థ క్వాన్ కై-హ్యూన్‌ను చైనా స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి అధిపతిగా పేర్కొంది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు, మెమరీ చిప్‌లు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే సామ్‌సంగ్ గ్రూప్ లీడర్ జై వై లీ అరెస్ట్ తరువాత సామ్‌సంగ్ భవిష్యత్, వ్యూహలపై సందేహాలను రేకెతిస్తుంది. మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హేను బ్యాన్ చేసి అరెస్టు చేయడానికి దారితీసిన కుంభకోణంలో భాగంగా జై వై లీ(48) ఫిబ్రవరి నుండి నిర్బంధంలో ఉన్నారు.