28.7 C
Hyderabad
April 28, 2024 06: 12 AM
Slider పశ్చిమగోదావరి

మంజూరైన గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలి

#pedavegi

గృహాలు మంజూరైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల గృహ నిర్మాణ శాఖ ఏ ఈ  టి వివేకానంద రావు అన్నారు. ఒక్కొక్క గృహానికి 1లక్షా 80 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం  అందజేస్తుందన్నారు. ఇవికాక ద్వాక్రా సంఘాల ద్వారా  బాంక్ లింకేజ్ తో తిరిగి చెల్లించే పద్దతిపై అదనంగా మరో 35 వేలు అందజేస్తున్నట్టు వివరించారు.

రామసింగవరం గ్రామంలో గృహ నిర్మాణ లబ్దిదారులకు ప్రభుత్వం ద్వారా గృహ నిర్మాణాలకు  అందించే మెటీరియల్ వివరాలను తెలియ జేశారు. గృహం మంజూరైన ప్రతి లబ్దిదారునికి బస్తా230రూపాయల ఖరీదు చొప్పున 90 సిమెంట్ బస్తాలు.28వేల రూపాయల విలువ చేసే అర టన్ను ( 500)కేజీలు ఐరన్ .20 టన్నుల ఇసుక అందజేస్తున్నామని చెప్పారు.

స్టేజ్ ల వారీగా నిర్మాణాలు పూర్తి చేసిన గృహాలకు బిల్లులు వెంటనే అందజేస్తామని ఏ ఈ చెప్పారు. గ్రామంలో లేఅవుట్ ద్వారా255 స్థలాలు, స్వంత స్థలాలు 223 మొత్తం 478 స్థలాలు మంజూరు కాగా ఆ స్థలాలన్నింటిలో గృహలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 85 గృహాలు వివిధ నిర్మాణాల దశలలో ఉన్నాయని హోసింగ్ ఏ ఈ  వివేకానందరావు   చెప్పారు. ఈ కార్యక్రమంలో గృహానిర్మాణశాఖ వర్క్ ఇన్స్పెక్టర్ ఎ చినబాబు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మోహిన్ తో పాటు దుర్గమ్మకాలనీ మహిళా లబ్ధిదారులు  పాల్గొన్నారు.

Related posts

దేశాన్ని కుదిపేస్తున్న PFI ఉగ్రవాద కార్యకలాపాలు

Satyam NEWS

కేసుల మాఫీ కోసమే సిఎం జగన్ మోడీకి సలాం చేస్తున్నారు

Satyam NEWS

ప్రమాదాల నివారణకు స్వయంగా స్పీడ్ బ్రేకర్లు వేసిన ఎస్ఐ

Satyam NEWS

Leave a Comment