ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రా(కె)గ్రామం అది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆ గ్రామం 6,500 మొక్కలను నాటింది. ఇది ఆ జిల్లాలోనే ఒక రికార్డు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కు గ్రామస్తులకు టిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జోగిన పల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కనూ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటాలని ట్విట్టర్ లో ఆయన నేడు కోరారు. ఈ గ్రామంతో అన్ని గ్రామా ల వారూ పోటీ పడాలని ఆయన సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే పలువురు మొక్కలు నాటుతూ పక్క వారికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అన్ని గ్రామాలూ ఈ గ్రామంలా చేసుకుంటే ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతం అవుతుందని సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
previous post