30.7 C
Hyderabad
April 29, 2024 06: 48 AM
Slider ప్రత్యేకం

కూలీగా మారిన సర్పంచ్

#sarpanch

ప్రజాసేవ చేయాల్సిన సర్పంచ్ ఆర్ధిక ఇబ్బందులతో కూలీ గా మారింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంతాలపల్లి గ్రామ సర్పంచ్ సుస్మిత తమ గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచింది. అందిలో భాగంగా గ్రామ అభివృద్ది కోసం 20 లక్షల రూపాయలు అప్పు చేసింది. బిల్లులు రాక పోవడం తో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో  పడిపోయింది. ఈ క్రమంలో ఇల్లు గడవడమే కష్టంగ మరటంతో కూలీ కి వెళ్తున్నది. అప్పుల భారంకు తోడు, కుటుంబ పోషణ బారమవడంతో చేసేదేం లేక దినసరి కూలి పనులు చేసుకుంటున్నామని సర్పంచ్ సుస్మిత వాపోయారు. అధికారులు తమకు రావాల్సిన బిల్లులు వెంటనే ఇస్తే తమకు భారం తగ్గుతుందని, అధికారులు కూడా కొందరు అనేక  ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

స్వచ్ఛ తెలంగాణ సాధన లో మరో ముందడుగు

Satyam NEWS

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు

Satyam NEWS

విజయనగరం ఎస్ పి ఆకస్మిక పర్యటన: లాక్ డౌన్ పర్యవేక్షణ

Satyam NEWS

Leave a Comment