31.2 C
Hyderabad
May 3, 2024 00: 36 AM
Slider వరంగల్

దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న సత్యం కుటుంబం

#mulugu

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో గల ఒక బీద కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. కోరుకొప్పుల సత్యం  అతని భార్య రాణి వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సత్యం కమలాపురం లో డిష్ ఆపరేటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాల క్రితం అతనికి బీపీ ఎక్కువ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాలు చెయ్యి కూడా పడిపోయింది. చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి సుమారు 7 లక్షల వరకు ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం లేదు.

ఇందులో సగం అప్పుగా పట్టుకు వచ్చారు. అయితే ఎన్ని మందులు వాడినా అతని ఆరోగ్యం కుదుటపడ లేదు. పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒకరు 9th క్లాస్ మరొకరు ఇంటర్ 1st ఇయర్. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితి. సత్యం భార్య RMC స్కూల్లో ఆయాగా పని చేస్తుంది. ఆమెకు వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులకు, మంచానికి పరిమితమైన సత్యం డైపర్స్ మార్చడానికి  కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు వారికి ఇల్లు గడవడం కూడా చాల కష్టం గా ఉంది. ఒకే ఇంట్లో సత్యం వారి భార్య ఇద్దరు పిల్లలు సత్యం వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు. ఒక్కరోజు ఖర్చు తక్కువలో తక్కువ 500 రూపాయల వరకూ ఉంది. మరింకే దారి లేని సత్యం కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నది.

మహేందర్ కూనూరు, జర్నలిస్టు, ములుగు జిల్లా సెల్ నెం. 98487 87205

Related posts

సమష్టి కృషితో సర్వతోముఖాభివృద్ధి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

Satyam NEWS

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జైలుకే

Satyam NEWS

కులాల రొష్టులో పడ్డ ఈ కమలం వికసించేనా?

Satyam NEWS

Leave a Comment