36.2 C
Hyderabad
April 27, 2024 21: 54 PM
Slider విశాఖపట్నం

యూజ్ అండ్ త్రో: సాలూరు రాజన్నకు జగన్ ఝలక్

#jagan

వాడుకుని వదిలేసే అలవాటు ఉన్న ఏపీ సీఎమ్‌ ఇప్పటికే చాలా మందికి హ్యాండ్‌ ఇచ్చారు. తాజాగా సాలూరు ఎమ్‌ఎల్‌ఏ, డిప్యూటీ సీఎం రాజన్నదొరకు ఆ ‘టైమ్’ వచ్చింది. జగన్ రెడ్డి ఇటీవల రాజన్నదొర సొంత నియోజకవర్గం సాలూరులో జరిగిన సభలో ఆయనకు టికెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత కొంతకాలంగా జగన్‌ ఏ నియోజకవర్గంలో సభ పెడితే, అక్కడి ఎమ్‌ఎల్‌ఏని పని చేసుకోవాలని, కష్టపడాలని, ప్రజలకు చేరువ కావడానికి విస్తృతంగా పర్యటించాలని చెబుతారు. అక్కడితో ఆగకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించి సదరు అభ్యర్ధి పలు విన్నపాలు చేసుకున్నాడని, వాటికి తాను ఆమోదం తెలిపానని, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చేవాడు.

అయితే సాలూరు నియోజకవర్గంలో జగన్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే అయిన రాజన్నదొర గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాజన్నదొరకు తాను కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకున్న జగన్‌ ఇప్పుడు ఆ అవసరం తీరగానే రాజన్నదొరకు కనీసం టిక్కెట్ కూడా ఇవ్వడం లేదట. ఏపీ రాజకీయాలలో సీనియర్‌ నేతగా రాజన్నదొరకు మంచి గుర్తింపు ఉంది. 2004లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయింది. టీడీపీ నుండి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోయారు.

ఆ తరవాత రాజన్న దొర కాంగ్రెస్‌కి జంప్‌ చేశారు. 2009 నుండి వరస విజయాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ సాధించిన రాజన్నదొరకు ఎస్‌టీ నియోజకవర్గాలలో మంచి పట్టున్న నేతగా ఇమేజ్‌ దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఐ ప్యాక్‌ టీమ్‌ సర్వేల ఫలితంగా రాజన్న దొర కు జగన్ రెడ్డి టిక్కెట్ ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. 2024లో రాజన్న దొరకు టికెట్‌ దొరకడం కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాజన్నదొరకు హ్యాండ్‌ ఇస్తే వైసీపీకి కొత్త అభ్యర్ధిని ఇప్పటికే లైన్‌లో పెట్టుకొని ఉండి ఉండాలి..

అదే జరిగితే, రాజన్న దొర సైలెంట్‌గా ఉంటారా?. లేక తిరుగుబాటు జెండా ఎగరవేస్తారా.? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. రాజన్నదొరకు టికెట్‌ దక్కకపోతే ఆయన టీడీపీ లేదా జనసేనకి జంప్‌ చేస్తారా అనేది మరో కీలక అంశం. లేక స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగితే, అది వైసీపీకే డ్యామేజ్‌ అవడం ఖాయంగా కనిపిస్తున్నది.

Related posts

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

Sub Editor

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

Satyam NEWS

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS

Leave a Comment