32.2 C
Hyderabad
May 2, 2024 01: 56 AM
కవి ప్రపంచం

శేషకీర్తి సువర్ణఛత్రం

#Kottapally Udaybabu

నిర్మలసరస్సులో కలువై ప్రభవించడం సామాన్యమే…

వేయి పడగల పద్మమై వికసించడమే చరిత్ర.

చరితకు ఆదర్శమవ్వడం ముఖ్యమే కాదు

పరిమళమద్ది పరిమళించడమే జన్మసార్ధకత.

దేశమాత ప్రధానామాత్యుల నగలో

ఏకైక అనుంగు తెనుంగు వజ్రసూర్యుడతడు.

సరస్వతీమాత ఘంటారావమై రవళించిన

భాషలప్రక్రియల క్రీడా విద్యాకోవిదుడు.

ఆర్ధికవ్యవస్థ చిరుగులకు నేతగాడై

సంస్కరణల రూపకల్పన పతాకంతో

ప్రగతీరధాన పయనింపచేసిన రధసారధి.

పత్రికావిలేకరత్వపు ప్రవృత్తియందు ప్రావీణ్యుడై

రాజకీయ పరమపదసోపానపటంలో

అరుకాషుని దాటిన ప్రధాన  అమాత్యశిఖరం.

ఆగ్రహాన్ని కోశస్థదశన నిద్రబుచ్చి

లౌక్యపు సీతాకొకై విహరించిన నేర్పరి.

రాజనీతి చాణిక్యతా పగ్గాలు పట్టి అల్పాయుష్కపు

ప్రభుత్వానికి పూర్ణాయుర్దాయమొసగిన విధాత.

పూర్ణబింబపు కావ్యంలో మరకపేజీలు వెక్కిరించినా

అణుపరీక్షల కదనరంగాన గెలిచిన అణుబాంబు.

దేశవిదేశ శిఖరాగ్రసమావేశపు ప్రసంగాల పరిపక్వతకు

అబ్బురపు ప్రశంసలన్నీ  అలవోకగా విస్తుబోయేవి.

ఆచంద్రార్కాపు తెలుగుజాతి ఖ్యాతికి

పీ.వీ.జీ  నిలువెత్తు  శేషకీర్తి సువర్ణఛత్రం !!!

కొత్తపల్లి ఉదయబాబు, సికింద్రాబాద్ 9441860161.

Related posts

మన తెలంగాణ బిడ్డ

Satyam NEWS

వెలుగు పువ్వులు

Satyam NEWS

నిండైన మూర్తిమత్వం

Satyam NEWS

Leave a Comment