Slider కవి ప్రపంచం

స్నేహ సౌరభం!

#Tadinada Bhaskararao

స్నేహానికి చిహ్నం, చేయి చేయి కలపడం

జీవితానికర్థం, ఒకరునొకరు తెలుసుకుని మసలడం

విజయానికి సోపానం, భవితకు తార్కణం

స్నేహ సంగమం, మన హృదయంగమం…. స్నేహానికి…

కుల మతాలకతీతం, మంచి చెడుల పరిష్కారం

సమాచార సహాయం, అందించే దు:ఖాన్ని పంచుకోవడం

వినయంగా,వినోదంగా, చేయి చేయి కలుపుదాం

భావాల ఊహలకు భాంధవ్యం, మనస్నేహితుల అనుబంధం..స్నేహనికి….

పరిమళాలు ప్రవహించే,పరిసరాలు పులకించే

అనుభవాల అనుభూతుల్ని,అవసరాల అవకాశాన్ని

ఒకటిగా మలచి, ఉన్నతిగా నిలచి

నవ్వుతూ నవ్విస్తూ బ్రతుకుదాం

తరలిపోదు,తరిగిపోదు, ప్రేమైకభావనం

పుడమి పరిమళం మన స్నేహ సౌరభం… స్నేహానికి…

తాడినాడ భాస్కర రావు, తణుకు, 9441831544

Related posts

ప్రోటోకాల్ రచ్చ: రజనికి అందలం: రోజాకు అవమానం

Satyam NEWS

అతి శీతల ప్రదేశంలో హృదయవిదారక మరణం

Satyam NEWS

పాలకుర్తి-వల్మీడి-సన్నూరు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ కావాలి

mamatha

Leave a Comment

error: Content is protected !!