40.2 C
Hyderabad
April 29, 2024 18: 55 PM
కవి ప్రపంచం

అచ్ఛమైన భారత రత్నం

#Srirangam Satyanarayana

వీర తెలంగాణా గడ్డపై పుట్టిన

తెలుగు తల్లి ముద్దు బిడ్డ

తెలుగు జాతికే కాదు, యావత్ భారత  జాతికీ ఠీవి మన పీ.వి.

రాజకీయ చదరంగాన నీవే మేటి

నీకెవరూ లేరు పోటి, నీకు నీవే సాటి

మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రిగా,

ఆపై సకల భారతమును పాలించిన

మొట్ట మొదటి ఏకైక తెలుగు బిడ్డ

అపర చాణక్యుడు,

ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు,

పరిపాలనా మేధావి,

మాజీ భారత దేశ ప్రధాన మంత్రి మన పీవీ

బహు భాషలు తెలిసిన

కైతలమ్మ కెమ్మోవి పీవీ

మౌనంగా మొక్కలా ఎదిగిన మా పీవీ

నీవు ఎంత చదివినావో, ఎంత ఎత్తుకు పైకి ఎదిగినావో, అంతగా ఒదిగి జీవించిన వాడవు నీవే మా పీవీ

కీర్తిశేషుడవైనా మీ  కీర్తి చిరస్మరణీయం!

భరత భూమిపై,

మీరు మళ్లీ తెలుగు బిడ్డగా జన్మించి ఉంటే,

భారతదేశపు ప్రధాన మంత్రివి మీరే మీరే మళ్లీ కావాలనీ

భారత రత్నఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మనసారా

బిరుదు ఇచ్చినా ఇవ్వకున్నా,

మీరు అచ్చమైన, స్వచ్చమైన మా “భారత రత్నం” మీరే పీవీ

శ్రీరంగం సత్యనారాయణ, వనస్థలిపురం, హైదరాబాద్

Related posts

ఓ మహాయోగి

Satyam NEWS

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS

తొలకరి

Satyam NEWS

Leave a Comment