28.7 C
Hyderabad
April 27, 2024 04: 32 AM
Slider కవి ప్రపంచం

తొలకరి

#Dr.Karnati Lingaiah

నిన్నటి వరకు ఎండ తీవ్రంగా ఉంది

ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేసింది

అంతా అనారోగ్యాలతో తల్లడిల్లారు

“తొలకరి “కోసం ఎదురు  చూశారు!!

తెల్లని మేఘాలు నింగిలో  మెల  మెల్లగా కదల

కనిపించును ఆకాశంలో దూది  పింజాల వలె

పచ్చని పైరుల  పై గాలి అలల వలెనే కదల

ఎంత హాయి మనసు కింపగు పల్లె స్వరూపాలు !!

పచ్చదనకు ఆకర్షణే తొలకరి ప్రేరణం

వర్షానికి పచ్చని ప్రకృతి శుభ్రతకు తార్కాణం

“తొలకరి” జల్లులే జగతికి జీవనాధారం

నీలి గగన నిర్మలం హాయి గొల్పు దృష్యం !!

వర్షధారంతోనే పల్లెలు పచ్చదనం

“తొలకరి”చినుకులతో అరికట్టలు కట్టి దున్నటం

గుంటుక  హలాలే పల్లె ప్రగతి పథo

పంట పొలాలే పల్లె ప్రజల జీ వన  కుసుమం!!

వర్షం మొదలైoది గాలి తోడుగా నిలిచింది

అనుభూతి చినుకుల అనుభవాల జల్లులు

చిన్ననాటి జ్ఞాపకాల చిరుజల్లులు

జ్ఞాపకాల్ని మనోపలకంపై బాల్యపు గుర్తుల జల్లులు !!

-డా. కర్నాటి లింగయ్య మీర్ పెట్, హైదరాబాద్. (9515298610)

Related posts

అమ్మ

Satyam NEWS

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

Satyam NEWS

ఆత్మరక్షణ కొరకు మాకు ఆయుధాలు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment