40.2 C
Hyderabad
April 29, 2024 16: 52 PM
కవి ప్రపంచం

మధుర జ్ఞాపిక మన పివి

#Dr.Vemula Tirupati Reddy

మన తెలంగాణా ముద్దుబిడ్డ, తొలి ప్రధానిగా

తెలుగు రాష్ట్రాల నేత మన వంగర బిడ్డ,

అపర మేధావి గా ఘన కీర్తి చాటిన

రాజకీయ గురువు మన పివి

పుట్టింది మారుమూల  గ్రామం ,

చదివింది నాగపూర్  కళాశాల,

చూసింది నిరంకుశ పాలన

పోరుకు గర్జించిన  ఘనుడు మన పివి

దేశ ప్రధానిగా డిల్లీ ఏలుబడిలో

ఎన్నో అవరోధాలు అధిరోహించి

ఆర్థిక సామాజిక స్థితులను మలుపు తిప్పిన ఆర్థిక సంస్కరణల పితామహుడు మన పివి 

ఎగసిపడిన  ఉద్యమ కెరటం 

చదువుల పుట్ట, నేర్పరిలో 18 భాషల దిట్ట.               

రాజకీయ కీర్తి ఘనుడు

అపర చాణక్యుడు మన పివి  

సాహిత్యములో పొదిగిన ఆణిముత్యం

రాజకీయ మకుటం లో మాణిక్యం

శత జయంతి ఉత్సవాల వెలుగుజాడ

ముందు తరాలకు మధుర జ్ఞాపిక మన పి.వి.

డా.వేముల తిరుపతి రెడ్డి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా, సెల్ నెంబర్ 9000190800

Related posts

సంక్రాంతి సందడి

Satyam NEWS

భారతావనికి మార్గదర్శి

Satyam NEWS

సంభవామి యుగే యుగే

Satyam NEWS

Leave a Comment