40.2 C
Hyderabad
April 29, 2024 16: 40 PM
కవి ప్రపంచం

సరిలేరు నీకెవ్వరు

#Dr.Urmiladevi Kadapa

ప్రధానమంత్రి పదవికి వన్నెతెచ్చిన తీరు

ఈ ప్రపంచములో పోటీకి పివికి సరికారు ఎవ్వరు

సగర్వంగా చాటుదాము వారు మా తెలుగువారు

వ్యక్తిత్వంలో పి వికి సరిలేరు ఎవ్వరూ

క్రమశిక్షణకు, అంకిత భావానికి పివిగారు మారుపేరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివిగారి పనితీరు

ఎందరో నాయకులకు మార్గదర్శం అయ్యారు.

బహుభాషా పాండిత్యములో పివి గారికి సరిలేరు ఎవ్వరూ

ప్రధాన మంత్రిగా ఆర్ధిక సంక్షోభానికి తెరదించారు.

కొత్త ఆర్ధిక విధానంలో ప్రపంచములో నెం.1 అయ్యారు

భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన గొప్పనాయకుడు పివి గారు

ఎన్నో సమస్యలను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపారు

భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేశారు

పరిపాలన సంస్కరణలు నేటికి, నాటికి, ఏనాటికి గొప్పవంటున్నారు ప్రతి ఒక్కరు

నిజమైన ప్రజాస్వామ్యానికి పివి గారు నిలువుటద్దం అంటున్నారు అందరూ

పి వి విదేశీ వ్యవహారంతో ఎన్నో దేశాలు మనకు స్నేహితులయ్యారు

రామరాజ్య స్థాపనకు అహర్నిశలూ కృషిచేసినవారు పివిగారు

ప్రజా సంక్షేమం కోసం నిత్యకృషీవలుడు

అలుపెరుగని మహానాయకులు ఈ పివిగారు

ప్రపంచ దేశాలలో భారతీయ ప్రతిష్టను ఇనుమడింప చేశారు

డాక్టర్ ఊర్మిళాదేవి, కడప, సెల్ నెం:9440424322

Related posts

మహోన్నత వ్యక్తి

Satyam NEWS

గీతాల సూర్యుడు

Satyam NEWS

ఒక వేణువు ఆగింది

Satyam NEWS

Leave a Comment