38.2 C
Hyderabad
April 29, 2024 14: 27 PM
కవి ప్రపంచం

ధీశాలి

#Ravula Madhavilatha

పాములపర్తి వంశోద్ధారకుడై

పల్లె నుండి ఢిల్లీ కేగిన తెలంగాణ తేజంగా

‘వందేమాతర గీతం’ ఆలాపనతో

విద్యాలయం బహిష్కరించినప్పటికి భయపడని ధీశాలిగా

కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ ను

నూతన సంస్కరణలతో నిలబెట్టిన

అపరచాణక్యుడుగా

పలు భాషల్లో ప్రావీణ్యం పొంది

అలీనదేశాల సమావేశంలో

స్పానిష్ లో భాషించి మెప్పించిన

బహుభాషాకోవిదుడుగా

భారత ఆర్థిక వ్యవస్థ కు బీజం వేసిన

ఆర్ధిక సంస్కరణల పితామహుడుగా

ఎన్నో మంత్రిత్వ శాఖలను అధిరోహించి

ప్రధానమంత్రి గా భారతాన్నేలిన

ప్రముఖ రాజానీతిజ్ఞుడుగా

‘లోపలి మనిషి’యొక్క లోతులను తెలిపి

‘వేయిపడగలను’అనువదించిన

అద్భుత సాహితీవేత్తగా

విమర్శలను ఎదుర్కొన్నా

వీరుడై నిలిచిన వినయశీలిగా

నిలిచిన మన పి.వి.

మనందరికి గర్వకారణం.

-రావుల మాధవీలత, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా, సెల్ నెం: 6281051344

Related posts

అక్షరమా…

Satyam NEWS

‘శోభా’ గమనం

Satyam NEWS

అభివృద్ధి విధాత

Satyam NEWS

Leave a Comment